Vishwak Sen Sorry.. ఎవడైతే నాకేంటి.? అనుకునే టైపు విశ్వక్ సేన్.! మాస్ కా దాస్.. ఎవరి మాటా వినడు.! ఇదీ విశ్వక్ సేన్ గురించి, అతని అభిమానులు కొందరు చెప్పేమాట.
కానీ, విశ్వక్ సేన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఓ ‘నోట్’ విడుదల చేశాడు.. అదీ, ఇటీవల తన సినిమాలు ఫ్లాప్ అవడం గురించీ, ఆ సినిమాల్లోని అసభ్యత గురించీ.
విశ్వక్ సేన్ విడుదల చేసిన లేఖ పూర్తి సారాంశం..
నమస్తే.. ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను.

నన్ను నమ్మి, నా ప్రయాణానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ – నా అభిమానులకు, నాపై ఆశీర్వదంగా నిలిచినవారికి హృదయపూర్వక క్షమాపణలు.
నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే. కానీ, ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను.
ఇకపై, నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే, అసభ్యత వుండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే, నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు వుంది.
ఎందుకంటే, నా ప్రయాణంలో ఎవరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు.
నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు.
ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా వుండాలని నిర్ణయించుకున్నాను. అంతే కాకుండా నా మీద విశ్వాసం వుంచిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలిజేస్తున్నాను.
అలాగే, నా కథానాయకులు, దర్శకులు, రచయితలు నా వెన్నెముకగా నిలిచి, నన్ను మలిచిన ప్రతి ఒక్కిరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరొక బలమైన కథతో ముందుకు వస్తాను.
నా మంచి, చెడు కాలాల్లో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం.. అంటూ విశ్వక్ సేన్ క్షమాపణ లేఖని ముగించాడు.
Vishwak Sen Sorry.. నిజంగా మారితే మంచిదే కదా.!
మార్పు మంచిదే.! విశ్వక్ సేన్ తాజా సినిమా ‘లైలా’లో అసభ్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
నిజానికి, విశ్వక్ సేన్ సినిమా అంటేనే, వల్గారిటీ.. అన్నట్లు తయారైంది పరిస్థితి. కొన్ని క్లీన్ సినిమాలూ విశ్వక్ సేన్ చేశాడు.. అది వేరే విషయం.
సినిమా ప్రమోషన్ల సమయంలో విశ్వక్ సేన్ బాడీ లాంగ్వేజ్, అతని మాటల్లో వల్గారిటీ.. ఇవన్నీ ఆయన కెరీర్‌ని పాతాళానికి తొక్కేశాయన్నది నిర్వివాదాంశం.
విడుదల చేసిన క్షమాపణ లేఖ మనస్ఫూర్తిగా రూపొందించుకున్నదే అయితే, విశ్వక్ సేన్ నిజంగానే మారినట్లే.
నో డౌట్.. విశ్వక్ సేన్ మంచి నటుడు.! దర్శకుడు, నిర్మాత కూడా.! సో, చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటే, బౌన్స్ బ్యాక్ అవడం కష్టమేమీ కాదు.
ఆల్ ది బెస్ట్ విశ్వక్ సేన్.!