Vishwaksen Mechanic Rocky Buzz.. ఏ సినిమాకి అయినా బజ్ లేకపోతే కష్టం.! ఇది సినీ పరిశ్రమలో సహజంగానే వినిపించేమాట.! ఆ బజ్ కోసమే, బోల్డన్ని పబ్లిసిటీ స్టంట్లు చేస్తుంటారు.
ఇక, పబ్లిసిటీ స్టంట్స్ చేయడంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రూటే సెపరేటు.! తనకంటూ సెపరేట్‌గా ఓ ‘గ్యాంగ్’ ఏర్పాటు చేసుకున్నాడీ యువ హీరో.
నటుడు మాత్రమే కాదు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన విశ్వక్ సేన్, తన సినిమాకి బజ్ ఎలా తెచ్చుకోవాలో కూడా బాగా తెలిసినోడు. పబ్లిసిటీ కోసం ఏ స్థాయికైనా వెళ్ళగలినోడు కూడా.!
Vishwaksen Mechanic Rocky Buzz.. బజ్ ఎందుకు ఆలస్యమైంది.?
‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) పేరుతో విశ్వక్ సేన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కింది.. విడుదలకు సిద్ధమైంది కూడా. ఈ సినిమాకి పెద్దగా బజ్ లేదు.
ఈ విషయాన్ని స్వయంగా విశ్వక్ సేన్ (Vishwak Sen) చెప్పుకొచ్చాడు. బజ్ లేకపోవడం కాదు, బజ్ ఇవ్వలేదు.. అని సెలవిచ్చాడు విశ్వక్ సేన్.
బజ్ ఇవ్వలేదు.. అంటే, సినిమాకి బజ్ లేదని అతను కూడా ఫీల్ అవుతున్నట్లే కదా.! ఇక నుంచి కావాల్సినంత బజ్ ఇద్దాం.. అని తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాడు ఈ యంగ్ హీరో.
Also Read: ఒకే రోజు.. రెండు సినిమాలు.. రెండు రాష్ట్రాల్లో.!
ట్రైలర్‌తో బజ్ వచ్చిందా.? ప్చ్.! ఏదో కొంత గందరగోళంలో వున్నట్లున్నాడు. సినిమాలోని డైలాగ్ చెప్పడానికి తడబడ్డాడు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో.
ఆ సంగతి పక్కన పెడితే, విశ్వక్ సేన్ సినిమాకి రిలీజ్‌కి ముందర ఆటోమేటిక్‌గా బజ్ వచ్చేస్తుంటుంది. ‘మెకానిక్ రాకీ’ విషయంలోనూ అదే మ్యాజిక్ రిపీట్ అవ్వొచ్చు.
ఖచ్చితంగా ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) సినిమాతో మంచి హిట్ కొడ్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్.
‘మెకానిక్ రాకీ’ సినిమాలోో విశ్వక్ సేన్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్లుగా నటించారు.