Waltair Veerayya Blockbuster మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది.
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలంటే, ప్రీమియర్ టాక్ కోసం అభిమానులు కంటి మీద కునుకు లేకుండా ఎదురుచూస్తారు.
ఫర్ ఎ ఛేంజ్.. ఇక్కడ వేరేలా నడిచింది వ్యవహారం. అభిమానులకంటే దురభిమానులు ఎక్కువగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మీద పడ్డారు.!
ఔను, మెగాస్టార్ చిరంజీవి ఓ ఫైటర్. లేకపోతే, ఆరు పదుల వయసులో.. ఆ డాన్సులేంటి.? ఆ ఎనర్జీ ఏంటి.? ఇంకా ఏదో కొత్తగా ట్రై చెయ్యాలన్న ఆరాటమేంటి.?
Mudra369
రాత్రంతా కుప్పలు తెప్పలుగా ట్వీట్లు.. ‘వాల్తేరు వీరయ్య’ మీద ట్రోలింగ్ చేయడానికి ఫాఫం.. నిద్ర లేకుండా గడిపారు రాత్రంతా.!
Waltair Veerayya Blockbuster డిజాస్టర్ అంటూ మొదలు పెట్టి..
సినిమాలోని కొన్ని క్లిప్పింగ్స్ ఎవరో ఫార్వార్డ్ చేసినవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెగెటివిటీని మొదలెట్టారు.. పైశాచికానందం పొందారు.

క్రమంగా సీన్ మారింది తెల్లారేసరికి. ‘సినిమా బాగానే వుందటగానీ..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. చివరికి ‘పూనకాలు లోడింగ్’ అని అంగీకరించక తప్పలేదు.
దటీజ్ మెగాస్టార్ చిరంజీవి..
తెలిసిగానీ, తెలియకగానీ.. చిరంజీవి ఎవర్నీ హర్ట్ చేయడానికి ఇష్టపడరు. కానీ, చిరంజీవిని టార్గెట్గా చేసుకుని, ఆయన మీద బురద చల్లడానికి ఎప్పుడూ వర్గం సిద్ధంగా వుంటుంది.
‘ఆచార్య’ సినిమా విషయంలో ఏం జరిగిందో చూశాం.! నిజానికి, కెరీర్ అంతా చిరంజీవి ఈ నెగెటివిటీ మీద పోరాడుతూనే.. విజయం సాధిస్తూనే వచ్చారు.
Also Read: Veera Simha Reddy FDFS: మాస్ జాతర.. కండిషన్స్ అప్లయ్.!
ఔను, మెగాస్టార్ చిరంజీవి ఓ ఫైటర్. లేకపోతే, ఆరు పదుల వయసులో.. ఆ డాన్సులేంటి.? ఆ ఎనర్జీ ఏంటి.? ఇంకా ఏదో కొత్తగా ట్రై చెయ్యాలన్న ఆరాటమేంటి.?
బాస్ ఈజ్ బ్యాక్.. ఈ దెబ్బకి ఇంకోసారి నెగెటివిటీ బలాదూర్.! ప్రీమియర్స్కే నిద్ర లేదు హేటర్స్కి.. ఇక నుంచి రికార్డుల జాతర షురూ.! ఈ సంక్రాంతి.. హేటర్స్కి కాళరాత్రి లాంటిదేనేమో.!