Waltair Veerayya Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి డీజే వీరయ్యగా మారిపోవడమేంటి.? ‘బాస్ పార్టీ’ అంటే ఆ మాత్రం కిక్కు వుండాలి కదా.!
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఈ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమా నుంచి ‘బాస్ పార్టీ’ అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ రివీల్ చేసింది.
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా (Urvashi Rautela) ఈ పాట కోసం మెగాస్టార్ చిరంజీవితో ఆడి పాడింది. దేవిశ్ర ప్రసాద్ (Devi Sri Prasad) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
Waltair Veerayya Chiranjeevi.. స్టెప్పులు ఇరగదీశాడుగా.!
మాంఛి మాస్ పాట పడితే, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఏ స్థాయిలో చెలరేగిపోతారో చెప్పడానికి ఈ పాట ఓ నిదర్శనం. ఆ ఏజ్ ఏంటి.? ఆ జోష్ ఏంటి.? అని అంతా ఆశ్చర్యపోతున్నారు ‘బాస్ పార్టీ’ సాంగ్ చూసి.
లుంగీ కట్టి.. మెగాస్టార్ చిరంజీవి ‘బాస్ పార్టీ’కి డాన్స్ చేస్తోంటే.. ఆ కిక్కే వేరప్పా.! థియేటర్లలో ఈ పాటకి పూనకాలు ఖాయం.!
మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అన్నట్టు, షూటింగ్ స్పాట్‌లో పవన్ కళ్యాణ్ కూడా కనిపిస్తున్నారు.

గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నుంచి నిఖార్సయిన మాస్ సాంగ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
‘ఆచార్య’ (Acharya) సినిమా కోసం రెజినా కస్సాండ్రాతో (Regina Cassandra) కలిసి ‘చానా కష్టం’ అంటూ సాగే సాంగ్‌లో చిరంజీవి (Chiranjeevi) డాన్స్ చేసినా, ఆ సినిమా ఫ్లాప్ కావడంతో అభిమానులు కొంత నిరుత్సాహపడ్డారు.
Also Read: Samantha Ruth Prabhu డెడికేషన్.! వేరే లెవల్ అంతే.!
కానీ, ఈసారి మాస్ ఆడియన్స్‌కి ఫుల్ మీల్స్.. అన్నట్లుగా ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాని దర్శకుడు బాబీ డిజైన్ చేసినట్టున్నాడు. శృతిహాసన్ ఈ సినిమాలో కథానాయిక.
‘బాస్ పార్టీ’ లిరికల్ సాంగ్ చివర్లో ‘డీజే వీరయ్య’ అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగ్.. కెవ్వు కేక అంతే.!