Waltair Veerayya.. మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ మెగాస్టార్ చిరంజీవి. నిజానికి, క్లాస్ – మాస్ అన్న తేడాల్లేవు చిరంజీవికి. కాకపోతే, మాస్ సినిమాలంటే మరింతగా చెలరేగిపోతారు చిరంజీవి.
రాజకీయాల్లోకి వెళ్ళడం ద్వారా దాదాపు తొమ్మిదేళ్ళ సినిమా కెరీర్‌ని ఆయన పణంగా పెట్టేయాల్సి వచ్చింది. బాస్ ఈజ్ బ్యాక్.! ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్.
ఆ తర్వాత ‘సైరా నరసింహా రెడ్డి’, ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ లాంటి సినిమాలు చేసినా, మాస్ మూలవిరాట్టు.. అన్న తన ఇమేజ్‌కి తగ్గ సినిమా ఇటీవలి కాలంలో చిరంజీవి చేయలేదు.
Waltair Veerayya.. అభిమాని.. దర్శకుడిగా మారి.!
అందుకే, ఆ మాస్ మూల విరాట్టుని ఇంకోసారి ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం చేసేందుకు మెగాభిమాని ‘బాబీ’ శ్రీకారం చుట్టాడు. అలా తెరకెక్కిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’.
మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ‘వాల్తేరు వీరయ్య’. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది ఈ సినిమాలో. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్..
మెగాస్టార్ చిరంజీవి వయసు ఆరవై ప్లస్.. కానీ, ఆయన జస్ట్ ముప్ఫయ్ ప్లస్.. అన్నట్టే కనిపిస్తున్నారు ‘వాల్తేరు వీరయ్య’ పాటల్లో.!
దటీజ్ మెగాస్టార్ చిరంజీవి. ఆయన మేకోవర్.. అన్ మ్యాచబుల్ అంతే.! ఆ వయసేంటి.? ఆ డాన్సులేంటి.? అని ఆశ్చర్యపోనివారుండరంతే.
ఆ మెగా డాన్స్ బిగ్ స్క్రీన్ మీద చూసి మురిసిపోవాలని లక్షలాది మంది, కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మత్స్యకారుడిగా.. దానికి మించి.. ఓ అండర్ వరల్డ్ మాఫియా డాన్ తరహాలో.. ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో చిరంజీవి కనిపిస్తుండడం గమనార్హం.
Also Read: నాగబాబు ప్రశ్నాస్త్రం: ప్యాకేజీ ఎవడమ్మ మొగుడ్రా ఇచ్చింది.?
రికార్డులు చిరంజీవికి కొత్త కాదు.. సంచలనాలు అసలే కొత్త కాదు.! అయినాగానీ, ఇంకోసారి ఆ మెగా సంచలనం కోసం.. మెగాభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో మరో సర్‌ప్రైజ్ ఎలిమెంట్ మాస్ మహరాజ్ రవితేజ. సినిమాలో 40 నిమిషాల నిడివి వున్న కీలక పాత్రలో రవితేజ కనిపిస్తాడు.
‘అన్నయ్య’ సినిమా తర్వాత చిరంజీవి – రవితేజ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ‘వాల్తేరు వీరయ్య’పై అటు మెగాభిమానుల్లో, ఇటు మాస్ మహరాజ్ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటేశాయ్.