Waltair Veerayya Rating.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వసూళ్ళ ప్రభంజనం కొనసాగిస్తోంది. థియేటర్లలో ‘పూనకాలు లోడింగ్’ కొనసాగుతూనే వుంది.
కాగా, మెగాస్టార్ చిరంజీవి అమెరికాలోని అభిమానులతో ముచ్చటించారు. సినిమా స్క్రీన్లపై మెగాస్టార్ చిరంజీవి లైవ్‌గా ప్రత్యక్షమయ్యారు. అభిమానులతో మాట్లాడారు.
ఈ సందర్భంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా రివ్యూలు, రేటింగులపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Waltair Veerayya Rating.. రేటింగుల్ని ఏకి పారేసిన చిరంజీవి..
‘2.25 రేటింగులంటే అది అమెరికాలో 2.25 మిలియన్లని అర్థం. దీన్ని బహుశా మనమే పొరపాటుగా అర్థం చేసుకున్నామేమో..’ అని చిరంజీవి సెటైర్ వేయడం గమనార్హం.

‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి రేటింగులు వేయడానికి కొన్ని ‘ఎజెండా వెబ్సైట్లు’ చాలా చాలా మొహమాటపడ్డాయి. కాదు కాదు, కంగారు పడ్డాయి.. బాధపడ్డాయి కూడా.
కొన్ని వెబ్సైట్లు మరీ దారుణంగా 1.5 రేటింగులు కూడా ఇచ్చాయ్. కానీ, ఇవేవీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా విజయాన్ని అడ్డకోలేకపోయిన సంగతి తెలిసిందే.
బిగ్గెస్ట్ హిట్ ‘వాల్తేరు వీరయ్య’
బాబీ దర్శకత్వంలో చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి రవితేజ మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్.
Also Read: ‘వాల్తేరు వీరయ్య’ మెగాస్టార్ చిరంజీవి ‘టూ పాయింట్ ఓ’.!
2023 సంక్రాంతికి రెండు స్ట్రెయిట్ సినిమాలొస్తే, ‘వీర సింహా రెడ్డి’కి అత్యుత్సాహంతో ఎక్స్ట్రా రేటింగులు ఇచ్చేశాయి కొన్ని వెబ్సైట్లు.
కానీ, ‘వాల్తేరు వీరయ్య’ క్లీన్ హిట్ కొట్టింది. సాధారణంగా మాస్ సినిమాలకి క్లాస్ సెంటర్లలో అంతగా సీన్ వుండదు. అయితే, ‘వాల్తేరు వీరయ్య’ అందుకు మినహాయింపు. క్లాస్ లేదు.. మాస్ లేదు.. ఓన్లీ బాస్.!
చిరంజీవి సినిమాలనే కాదు, మెగా కాంపౌండ్ నుంచి ఏ సినిమా వచ్చినా.. ‘రేటింగుల్లో కోత’ అనేది సర్వసాధారణమైపోయింది. ఇదొక రోగం అనుకోవచ్చేమో.!
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సైతం ‘రెండున్నర’ రేటింగులు ఇచ్చిన మూర్ఖులున్నారు. సినిమా విజయాల్ని ఈ రేటింగులతో శాసించేస్తామనుకోవడం మూర్ఖత్వం కాక మరేమిటి.?