Sakshi Vaidya.. ఆకర్షించే ముద్దు మోముతో, కైపెక్కించే కళ్లతో ఆకట్టుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? తెలిసే అవకాశం లేదులెండి.
ఇప్పుడిప్పుడే తెలుగు తెరకు పరిచయమవుతోందీ అందాల ముంబయ్ ముద్దుగుమ్మ.
అక్కినేని అందగాడు అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమాలోని హీరోయినే ఈ అందాల ఆడపులి. పేరు సాక్షి వైద్య. తొలి చూపులోనే కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేసే టాలెంట్ వుందీ అమ్మడిలో.
అసలే టాలీవుడ్‌కి హీరోయిన్ల కొరత. సాక్షి వైద్య లాంటి ఒడ్డూ పొడవూ వున్నముంబయ్ ముద్దుగుమ్మలకు టాలీవుడ్‌లో ఎప్పుడూ క్రేజ్ ఎక్కువే.
Mudra369
యాక్టింగ్ టాలెంట్ ఎలా వుండబోతోందనేది సినిమా చూస్తే కానీ తెలీదనుకోండి. అన్నట్లు ఈ మహారాష్ర్ట పోరి ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా ఒకింత సుపరిచితురాలేనండోయ్.
కమర్షియల్ యాడ్స్ ద్వారా తన యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది. అలా బుల్లితెరపై అమ్మడి ముఖం పరిచయమే. కానీ, గుర్తు పట్టలేదంతే.
Sakshi Vaidya.. కమర్షియల్ యాడ్స్‌లో..
TVS XL 100, Veet తదితర కమర్షియల్ యాడ్స్‌లో సాక్షి వైద్య నటించింది. తన క్యూట్ అప్పీల్‌తో ఆకట్టుకుంది. అలాగే, మోడలింగ్ రంగంలోనూ ఆల్రెడీ సత్తా చాటేసిందీ అందాల ముద్దుగుమ్మ.

ఇక, ఇప్పుడు వెండితెరపై తన అందాల ప్రతాపం చూపించేందుకు సిద్ధమవుతోంది. ‘ఏజెంట్’ సినిమాతో హిట్టు కొడితే, పాప దశ తిరిగిపోయినట్లే.
అసలే టాలీవుడ్‌కి హీరోయిన్ల కొరత. సాక్షి వైద్య లాంటి ఒడ్డూ పొడవూ వున్నముంబయ్ ముద్దుగుమ్మలకు టాలీవుడ్‌లో ఎప్పుడూ క్రేజ్ ఎక్కువే.
కొంచెం ఇష్టం కొంచెం కష్టం.!
సాక్షి వైద్యకు నాన్ వెజ్ అంటే చాలా చాలా ఇష్టమట. అయితే, హీరోయిన్ కదా.. కూసింత డైట్ ఫాలో చెయ్యాలి. లేపోతే లావైపోతారు. అందుకే, ఇష్టమైనా కాస్త కష్టపడి డైట్ ఫాలో చేస్తుంటుందట.

అలాగే ట్రావెలింగ్ అన్నా చచ్చేంత ఇష్టమట ఈ అందాల బొమ్మకి. ఎప్పుడు టైమ్ దొరికినా వెకేషన్లు ఎంజాయ్ చేస్తానని ముద్దు ముద్దుగా చెప్పేస్తోంది.
అలా వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ, ఆ ఫోటోలను తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేస్తుంటుంది సాక్షి వైద్య. అలా సోషల్ మీడియాలోనూ అమ్మడు పిచ్చ యాక్టివ్.
అప్పుడప్పుడూ గ్లామర్ ఫోటోలూ, అలాగే కొన్ని కాన్సెప్ట్ పిక్స్ షేర్ చేస్తూ, నెటిజన్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.

పెద్దగా ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేకపోయినా, యాక్టింగ్‌లో తన బెస్ట్ ఇచ్చేలానే వుంది అమ్మడి ముఖం చూస్తుంటే. ముందు ముందు అమ్మడి టాలెంటూ, భవిష్యత్తూ ఎలా వుండబోతోందో చూడాలి మరి.!