Yamini Bhaskar Psych Siddhartha.. ఆమె ఓ నటి.! చాలాకాలం తెలుగు తెరపై సందడి చేసింది. చాన్నాళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ ఆమె తెలుగు తెరపై సందడి చేయడానికి సిద్ధమైంది.
పేరేమో యామినీ భాస్యర్. ‘కాటమరాయుడు’ తదితర చిత్రాల్లో చిన్నా చితకా రోల్స్ చేసింది. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫాటోలతో అప్పట్లో హల్ చల్ చేసింది.!
‘సైక్ సిద్దార్ధ’ పేరుతో తెరకెక్కిన సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తోన్న యామినీ భాస్కర్, భయం భయంగానే మీడియా ముందుకు వచ్చానని చెబుతోంది.
దానిక్కారణం.. పెరిగిన బరువు.! ఔను, ఆమె ఈమేనా.? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అంతలా లావెక్కిపోయింది.! నాన్సెన్స్, కాస్త బొద్దుగా తయారైందనాలేమో.!
Yamini Bhaskar Psych Siddhartha.. అప్పట్లో నివేదా థామస్ కూడా..
అయినా, బరువు పెరిగితే నేరం కాదు కదా.? మొన్నామధ్య నివేదా థామస్ కూడా బరువు సమస్యనే ఎదుర్కొంది. మీడియా, ఆమెను గుచ్చి గుచ్చి ప్రశ్నించింది, ఆమె ఫిజిక్ విషయమై.

తనదైన నటనతో ‘చిన్న కథ కాదు’ సినిమాతో మెప్పించింది. నటిగా మంచి మార్కులేయించుకుంది. సో, బరువుకీ.. టాలెంట్‌కీ అసలు పొంతనే లేదన్నమాట.
‘సైక్ సిద్దార్ధ’ సినిమా ప్రమోషన్ల కోసం మీడియా ముందుకొచ్చిన యామినీ భాస్కర్, మీడియా నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయోనని భయపడ్డానని చెప్పింది.

అయితే, సోషల్ మీడియా వేదికగా కూడా, తన బరువు ప్రస్తావనను ఎవరూ తీసుకురాలేదనీ, తనను ఎవరూ ట్రోల్ చేయలేదనీ యామినీ భాస్కర్ చెప్పుకొచ్చింది.
Also Read: మిల్కీ బ్యూటీ తమన్నా ట్రెండీ సిగ్నేచర్.!
అన్నట్టు, ‘నర్తనశాల’ సినిమాలో నాగశౌర్య సరసన ఓ హీరోయిన్‌గా నటించింది యామినీ భాస్కర్. ఒకటీ అరా తమిళ సినిమాల్లో కూడా ఈ బ్యూటీ నటించిందనుకోండి.. అది వేరే సంగతి.
తన బరువు గురించి తానే చెప్పుకుంది గనుక.. ‘సైక్ సిద్దార్ధ’ సినిమా తర్వాత, కాస్త సన్నబడే ప్రయత్నాలు చేస్తుందేమో వేచి చూడాలి.!
