Young Tiger NTR: యంగ్ టైగర్ ఎన్టీయార్ ఇప్పుడేం చేస్తున్నాడు.? ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీయార్ ఆలోచనలు ఏమైనా మారాయా.?
ఓ వైపు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా కోసం సిద్ధమవుతూనే, ఇంకోపక్క ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తోనూ, మరోపక్క ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సనతోనూ చర్చోపచర్చలు చేస్తున్నాడు.
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా తెరకెక్కాల్సిన సినిమా, ఈపాటికే సెట్స్ మీదకు వెళ్ళాల్సి వున్నా, అనివార్య కారణాలతో అది మార్చి నుంచి జూన్‌కి వాయిదా పడింది.
ఈలోగా యంగ్ టైగర్ ఎన్టీయార్ కంప్లీట్ మేకేవోర్ మీద ఫోకస్ పెట్టాడనే ప్రచారం జరుగుతోంది.
ఆ సంగతి పక్కన పెడితే, తాజాగా ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీయార్ కలుసుకున్నారు.. తమ కాంబినేషన్‌లో రాబోయే సినిమా గురించి చర్చించుకున్నారు.
Young Tiger NTR పునరాలోచనలో పడ్డాడా.?
రాజమౌళి దర్శకత్వంలో ఏ హీరో నటించినా, రాజమౌళి సినిమా తర్వాత దారుణమైన ఫ్లాప్ చవిచూడాల్సిందేనన్న సెంటిమెంట్ ఒకటి బలపడిపోయింది. అది రామ్ చరణ్ విషయంలో ఒకటికి రెండు సార్లు ప్రూవ్ అయ్యింది.
యంగ్ టైగర్ ఎన్టీయార్ కూడా గతంలో ఆ అనుభవాన్ని చవిచూశాడు. పైగా, కొరటాల శివ తొలిసారిగా ఫ్లాప్ సినిమా చేశాడు తన కెరీర్‌లో.
మరిప్పుడెలా.? డబుల్ నెగెటివిటీ తమ కాంబినేషన్‌పై వుందన్న విషయం ఎన్టీయార్ అర్థం చేసుకోలేడా.?
Also Read: నేను విన్నాను.. నేను వున్నాను.! ర్యాగింగా.? ఫాలోయింగా.?
మరి, ఎన్టీయార్ ఏం చేయబోతున్నాడు.? ముందుగా బుచ్చిబాబు సనని రంగంలోకి దించుతాడా.? ఆ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్‌తో సినిమా చేస్తాడా.? ఇదే జరిగితే కొరటాలతో సినిమా మాటేమిటి.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
సినిమా అంటేనే మ్యాజిక్. ఇక్కడ సెంటిమెంట్లు కీలక భూమిక పోషిస్తాయి. ఆయా కాంబినేషన్లను ఆ సెంటిమెంట్లు నడిపించడమో, దెబ్బ తీయడమో చేస్తుంటాయ్.