YS Jagan Medical Colleges.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. అంటూ పెద్దయెత్తున దుమారానికి కారణమైంది వైసీపీ.!
అయితే, అది ప్రైవేటీకరణ కాదు.. ‘పీపీపీ’ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణం.. అంటోంది టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.
వైసీపీ హయాంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పదిహేనుకు పైగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వైసీపీ అంటోంది.
అయితే, పబ్లిసిటీ స్టంట్ తప్ప.. వాటి నిర్మాణంపై వైఎస్ జగన్ చిత్తశుద్ధి ప్రదర్శించలేదన్నది ప్రధాన ఆరోపణ, రాజకీయ ప్రత్యర్థుల నుంచి.
ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి పక్కన పెడితే, బాద్యతారాహిత్యమైతే స్పష్టంగా కనిపిస్తోంది మెడికల్ కాలేజీల నిర్మాణం విషయంలో.
నిధుల లేమి నేపథ్యంలో ‘పీపీపీ’ తప్పెలా అవుతుందని ఉన్నత న్యాయస్థానం కూడా వ్యాఖ్యానించిన విషయం, వైసీపీని ఇరకాటంలో పడేసింది.
YS Jagan Medical Colleges.. వైసీపీ సంతకాల సేకరణ..
ఇదే విషయమై ఇటీవల ఉత్తరాంధ్రలో వైఎస్ జగన్ పర్యటించారు.. ‘కోటి సంతకాల సేకరణ ఉద్యమం’ చేపడుతున్నట్లు ప్రకటించేశారు కూడా.!
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం నుంచీ, ప్రతి గ్రామం నుంచీ ప్రజల సంతకాలు సేకరించేలా వైసీపీ ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసింది.
ఇంతలోనే, వైఎస్ జగన్ అనూహ్యంగా లండన్‌కి పయనమయ్యారు. వైఎస్ జగన్, లండన్ పర్యటన ముందుగానే డిసైడ్ అయి వుండొచ్చు.
లండన్‌కి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్ళడమూ తప్పు కాదు. కాకపోతే, సమయం.. సందర్భం చూసుకోవాలి కదా.?
ఒకటీ, లండన్ పర్యటన అయినా వాయిదా వేసుకుని వుండాలి.. రెండూ, కోటి సంతకాల ఉద్యమం అయినా.. వైఎస్ జగన్ తిరిగొచ్చాక ప్రారంభించి వుండాలి.
జగన్, లండన్‌కి వెళ్ళిపోయినా.. వైసీపీ శ్రేణులు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడతాయంటే, దానికి అంత ‘రేంజ్’ వుండదు. పైగా, అసలు విషయం డైల్యూట్ అయిపోతుంటుంది.
ఆల్రెడీ, వీకెండ పొలిటీషియన్.. అనే విమర్శని ఎదుర్కొంటున్నారు వైఎస్ జగన్.
వారంలో ఓ సారి, బెంగళూరు నుంచి తాడేపల్లికి రావడం, తిరిగి బెంగళూరు వెళ్ళిపోవడం.. ఇదీ వైఎస్ జగన్ 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత చేస్తున్నపని.
ఇప్పుడీ లండన్ పర్యటన.. అదీ కీలక సమయంలో, వైఎస్ జగన్ నాయకత్వ లక్షణాల్ని ప్రశ్నార్థం చేస్తోంది.
