Home » RAW NTR: జూనియర్ ఎన్టీయార్‌కి వ్యతిరేకంగా కుట్ర.?

RAW NTR: జూనియర్ ఎన్టీయార్‌కి వ్యతిరేకంగా కుట్ర.?

by hellomudra
0 comments
Raw NTR

RAW NTR Ooru Vaada.. జూనియర్ ఎన్టీయార్ అభిమానుల ముసుగేసుకుని, RAW NTR అనే సంస్థ ముసుగులో.. ఓ పెద్ద కథ నడుస్తోంది.!

ఆ సంస్థతో తనకు సంబంధం లేదని, నేరుగా జూనియర్ ఎన్టీయార్ టీమ్ నుంచే ఓ ప్రకటన వచ్చింది. అయితే, ఆ ప్రకటన ఫేక్.. అని అంటోంది RAW NTR సంస్థ.

అసలు ఎవరు ఈ RAW NTR అంటే.? అతని పేరు సాయి రూప్. ఈ సంస్థ కింద చాలామంది పని చేస్తున్నారు. కోవిడ్ కంటే ముందే ఈ సంస్థ ఏర్పాటయ్యింది.

అయితే, కోవిడ్ తర్వాత RAW NTR సంస్థ కార్యకలాపాలు మరింత విస్తృతం అయ్యాయి. ఎంతలా.? అంటే, 100 కోట్లతో ‘ఊరూ వాడా’ కార్యక్రమం చేపడుతున్నట్లు సాయి రూప్ ప్రకటించేంతలా.?

RAW NTR Ooru Vaada.. వంద కోట్ల వ్యవహారం..

ఇంతకీ, వంద కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి.? అన్న ప్రశ్నకు సాయి రూప్ బదులిస్తూ, ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ’ కింద నిథులు సేకరిస్తామని చెప్పాడు.

జూనియర్ ఎన్టీయార్ పేరు మీద వంద కోట్ల రూపాయల వసూళ్ళు.? అన్న అనుమానాలకు ఇక్కడే తెరలేచింది. అసలు ‘ఊరు వాడ’ కార్యక్రమం ఏంటి.? అన్న అనుమానాలూ లేకపోలేదు.

ఎవరో వెనకాల వుండి, జూనియర్ ఎన్టీయార్‌కి వ్యతిరేకంగా పెద్ద కుట్రే పన్నారనీ, ఆ కుట్రలో భాగంగానే ఈ RAW NTR సంస్థ ఊపిరి పోసుకుందనీ, ఆ కుట్రకు అనుగుణంగానే సంస్థ నడుస్తోందనీ విమర్శలొస్తున్నాయి.

అబ్బే, మా సంస్థకు రాజకీయాలతో సంబంధం లేదని సాయి రూప్ చెబుతున్నాడు. తమ కార్యకలాపాలకి జూనియర్ ఎన్టీయార్ ఆమోదం ఏమీ అవసరం లేదనీ చెబుతున్నాడాయన.

Also Read: సినీ సమీక్ష: ‘బ్రేక్ ఫాస్ట్’.! ఇదేం కొట్టుడు మహాప్రభో.!

‘ఎన్టీయార్ ఆపమన్నా ఆపేది లేదు’ అని ఓ వైపు ప్రకటిస్తూనే, ఇంకో వైపు ‘ఏడేళ్ళుగా కష్టపడుతున్నా, మమ్మల్ని పట్టించుకోవడంలేదు’ అని నిందారోపణలు చేస్తున్నాడు సాయి రూప్.

‘వద్దు ఆపెయ్.. అని ఒకవేళ జూనియర్ ఎన్టీయార్ చెబితే.. ఒక హగ్ ఇచ్చి, వచ్చేస్తా..’ అని అంటున్నాడు సాయి రూప్. ఇది మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

మొత్తంగా ఈ RAW NTR వ్యవహారంతో జూనియర్ ఎన్టీయార్ అభిమానుల్లో స్పష్టమైన విభజన కనిపిస్తోంది. ఈ విభజన కోసమే ఆ సంస్థ పుట్టిందా.? అన్న అనుమానాలూ లేకపోలేదు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group