Ys Jagan Vizag Kapuram ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖలో ‘కాపురం’ పెడతానని అంటున్నారు.!
ట్రెండ్ మారింది.! కొత్తగా పెళ్ళయ్యాక ఎవరైనా ఎక్కడైనా కాపురం పెట్టాలని అనుకోవచ్చు. ఆ కొత్త కాపురం కథ కాదిక్కడ.! ఇది వేరే.!
అసలు విషయమేంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై రచ్చ జరుగుతోంది. ఏకైక రాజధాని అమరావతిని ‘కమ్మరావతి’ అంటున్న వైసీపీ, మూడు రాజధానుల పాట పాడుతోంది.
Ys Jagan Vizag Kapuram.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ.!
మింగడానికి మెతుకుల్లేవుగానీ.. మీసాలకు శంపంగె నూనె కావాలన్నాడట వెనకటికి ఒకడు.! ఇది తెలుగులో బాగా పాపులర్ అయిన పెద్దల మాట.. సెటైర్.!
ఒక్క రాజధాని అమరావతికే దిక్కు లేదు.. మూడు రాజధానులెలా.? అన్న ఇంగితం ఎవరికీ లేకుండా పోయింది.
సరే, వైసీపీ రాజకీయంగా ఓ నిర్ణయం తీసుకుంది రాజధాని విషయంలో.. మూడు రాజధానులంటోంది.. ఆ దిశగా ఏమైనా ముందడుగు వేసిందా.? అంటే.. అదంతే.
వేసినట్టే వేసింది.. చట్టాన్ని కూడా తయారు చేసే దిశగా బిల్లు పెట్టి పాస్ చేసింది చట్ట సభల్లో.. చివరికి కుదరక స్వహస్తాలతో ఆ బిల్లుని చింపెయ్యాల్సి వచ్చింది.
ఎలా.? ఇప్పుడెలా.?
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ‘కాపురం’ అంటున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ విషయంలో ఆయన్ని తప్పు పట్టడానికేమీ లేదు.
అమరావతిలో (తాడేపల్లిలో) సొంత ఇంటిని కాదని, విశాఖలో ఇంకో ఇల్లు సమకూర్చుకుని, కాపురం అక్కడ పెడితే కాదనేవారెవరు.?
Also Read: పొలిటికల్ ఎంవోయూ.! నిజం.. నేతి బీరకాయ్.!
రాజధాని వేరు.. కాపురం వేరు.! ముఖ్యమంత్రి ఎక్కడ వుంటే, అక్కడి నుంచే పాలన.. అన్న వైసీపీ మాటల్లో కొంత నిజం వుండొచ్చుగాక. కానీ, రాజధాని సంగతి వేరు.!
రేప్పొద్దున్న ఇంకొకాయన ముఖ్యమంత్రి అవుతారు.. కాపురానికి వేరే ప్రాంతం అనువుగా వుంటుందని భావించొచ్చు. అప్పుడు రాజధాని మారిపోతుందా.?
వ్యక్తులు వేరు.. వారి అభిప్రాయాలు వేరు.. రాజకీయాలు వేరు.! సంసారం వేరు.. పాలన వేరు.! కాపురం వేరు.. ప్రభుత్వం వేరు.!