Table of Contents
Ys Jagan Vs Pawankalyan.. రాజకీయాలన్నాక నాయకులు విమర్శించుకోవాలట.! ఇదేం రాజకీయ సూత్రమో.! ఏ నాయకుడైనా ప్రజల్ని ఉద్దేశించి, తమ రాజకీయ విధానాలు చెప్పుకోవాల్సి వుంటుంది.
ఈ క్రమంలో అధికారంలో వున్నవారి వైఫల్యాల్ని ఎత్తి చూపడం అనేది సర్వసాధారణం. ఈ క్రమంలోనే విమర్శలు.. అవి హద్దులు దాటి వ్యక్తిగత దూషణలు.. ఇలా తయారైంది వ్యవహారం.
ప్యాకేజీ స్టార్.. దత్త పుత్రుడు.. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు.. ఇలా పవన్ కళ్యాణ్ మీద చెత్త రాజకీయాలు చేస్తోంది వైసీపీ. వీటి వల్ల ప్రజలకేంటి ఉపయోగం.?
Mudra369
స్వచ్ఛ రాజకీయాల గురించి అందరూ మాట్లాడతారు, రాజకీయాల్లో స్వచ్ఛతని మాత్రం ఎవరూ పాటించరు. అదే మరి, రాజకీయమంటే.!
Ys Jagan Vs Pawankalyan రొచ్చు రాజకీయం..
పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చూసుకున్నారన్నది ఓ విమర్శ. విమర్శ కాదిది నిజం. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకుని, రెండో పెళ్ళి చేసుకున్నారు.
రెండో భార్య నుంచి విడాకులు తీసుకుని మూడో పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్‌కి. అది ఆయన వ్యక్తిగత జీవితం.
అంతేగానీ, పవన్ కళ్యాణ్ దొంగతనాలు చేయలేదు, జైలుకు వెళ్ళలేదు. హత్యలు చేయలేదు, హత్యారోపణలూ ఆయన మీద లేవు.
మూడు ముక్కల రాజకీయం..
ప్యాకేజీ స్టార్.. దత్త పుత్రుడు.. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు.. ఇలా పవన్ కళ్యాణ్ మీద చెత్త రాజకీయాలు చేస్తోంది వైసీపీ. వీటి వల్ల ప్రజలకేంటి ఉపయోగం.? అన్న కనీస విజ్ఞత వైసీపీలో కనిపించదు.

తనపై వస్తున్న విమర్శలకు పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చుకోక తప్పడంలేదు.. అదీ వైసీపీ స్టయిల్లోనే.
మూడు ముక్కల ముఖ్యమంత్రి, డైమండ్ రాణి, సంబరాల రాంబాబు.. ఇలా జనసేన అధినేత కౌంటర్ ఎటాక్ గట్టిగానే వుంది.
అధికార వుండి ఏం చేయగలిగారు.?
ప్యాకేజీ స్టార్.. అని పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే సరిపోతుందా.? సీఐడీ, ఏసీబీ.. ఇవన్నీ వున్నాయ్ కదా.! వీటితో విచారణ జరిపించేసి, ఆ ప్యాకేజీ ఎక్కడ ఎలా పవన్ కళ్యాణ్‌కి ముట్టిందో నిరూపించెయ్యొచ్చు.
Also Read: Money For Sale.. ఇచ్చట డబ్బులు అమ్మబడును.!
కానీ, అలా నిరూపించాలంటే అక్కడ ప్యాకేజీ అనేది వుండాలి కదా.? కనీసం, పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు అక్రమంగా జరిగాయనైనా నిరూపించడం చేతకావాలి కదా.? అదీ చేతకావడంలేదాయె.!
ఇంతకీ, పవన్ కళ్యాణ్ ఆరోపిస్తోన్న మూడు ముక్కలంటే ఏంటి.? ఇంకేముంటుంది.? బూతులతో కూడిన అడ్డగోలు ఆరోపణలు, పాలనా వైఫల్యం, రాజకీయ దోపిడీ.! ఇంతేనేమో.!