ఉమ్మడి ఆంధ్రపదేశ్‌కి రెండు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్తగా మార్మోగిపోతోందిప్పుడు. వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రస్తుతం 13 జిల్లాల ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆయన అధినేత. మరోపక్క, వైఎస్సార్ కుమార్తె షర్మిల (YS Sharmila Political Party In Telangana) కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు.. అదీ తెలంగాణలో.
ఆంధ్రపదేశ్‌లో రాజన్న రాజ్యం (Andhra Pradesh Rajanna Rajyam) తెస్తానంటూ వైఎస్ జగన్ (Ys Jaganmohan Reddy) ఎలాగైతే నినదించారో, అలాగే షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటున్నారు.
గతంలో అన్న జగన్ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) తరఫున తెలంగాణ, ఆంధ్రపదేశ్‌లలో (ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు) సుదీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిల, తెలంగాణలో త్వరలో పాదయాత్ర చేయబోతున్నారు. ఇంతకీ, షర్మిల ఎందుకు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు.? ఎవరి కోసం ఆమె ఇదంతా చేస్తున్నారు.?
షర్మిల ప్లానింగే ప్లానింగ్..
తెలంగాణలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) వుంది. కానీ, ఏపీలో వైసీపీ అధికారంలో వుండడంతో, తెలంగాణలో సమస్యలు రాకుండా.. తెలంగాణలో పార్టీని లైట్ తీసుకున్నారు వైఎస్ జగన్. అలాగని, తెలంగాణలో వైసీపీకి నాయకులు లేరనడమూ సబబు కాదు. వారిలో కొందరు, ఇప్పుడు షర్మిల (YS Sharmila Political Party In Telangana) పంచన చేరారు.
జగన్ (YS Jaganmohan Reddy) ఆశీస్సులు షర్మిలకు వున్నయా.? లేదా.? అన్నదానిపైనా భిన్న వాదనలున్నాయి. ‘ఏం, మా అన్న ఆశీస్సులు నాకు లేవని మీరు అనుకుంటున్నరా.? లేదంటే, మా అన్న ఏమైనా అలా చెప్పడా.?’ అని షర్మిల ప్రశ్నించేశారు. ఈ సమాధానంలో కొంత ‘తేడా’ చాలామందికి కనిపిస్తోంది.
‘వైసీపీతో షర్మిలకు సంబందం లేదు’ అని తేల్చేశారు వైసీపీ ముఖ్య నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy). తెలంగాణలో కొత్త పార్టీ పెట్టవద్దని జగన్ స్వయంగా షర్మిలకు సూచించినా, ఆమె మాత్రం పార్టీ పెట్టడానికే నిర్ణయించుకున్నరాన్నది సజ్జల ఉవాచ.
ఎక్కడో తేడా కొడుతోందే.. (YS Sharmila Political Party In Telangana)
అభిప్రాయ బేధాలు వుండడం సహజమే.. విభేదాలు, విద్వేషాలు మాత్రం లేవని సజ్జల చెప్పుకొచ్చారు. అభిప్రాయ బేధాలు వుండడమంటేనే వివాదాలున్నట్టు. పార్టీ వద్దే వద్దని జగన్ చెప్పినా, షర్మిల పార్టీ పెట్టబోతున్నారంటే, దానర్థమేంటి.?
అయితే, ఇదంతా ఓ పొలిటికల్ డ్రామా మాత్రమేనా.? తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్‌కి మద్దతుగానో, బీజేపీకి మద్దతుగానో.. లేదంటే, రెండు పార్టీలకూ ఉపయోగపడేందుకనో షర్మిలతో జగన్, కొత్త పార్టీ పెట్టిస్తున్నారా.? ఎన్నెన్నో ఊహాగానాలు.
అయితే, షర్మిల పార్టీని లైట్ తీసుకోవడానికి వీల్లేదు. రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పుడెలా మారిపోతాయో చెప్పలేం. వైసీపీ క్యాడర్ అంతా షర్మిల (YS Sharmila Political Party In Telangana) వైపు వెళితే, ఖచ్చితంగా ఆమె పెట్టబోయే పార్టీ తెలంగాణ రాజకీయాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అయి తీరుతుంది.