Ys Sharmila Telangana Police.. ‘పోలీసులు తాము ఎవరికి సెల్యూట్ చేస్తున్నామో గుర్తెరిగి వ్యవహరించాలి..’ ఓ రాజకీయ నాయకుడు కొన్నాళ్ళ క్రితం చేసిన వ్యాఖ్య ఇది.!
నిజమే మరి.! అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళినవారికీ, వివిధ నేరాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి పోలీసులు ఎందుకు మర్యాద ఇవ్వాలి.?
నేరస్తులు రాజకీయ నాయకులైనంత మాత్రాన, కీలక పదవుల్లో వున్న వ్యక్తులకు పోలీసులు గౌరవం ఇవ్వరాదన్న వాదన ఒకటుంది. అందులోనూ వాస్తవం లేకపోలేదు.
Ys Sharmila Telangana Police.. పోలీసు చెంప పగలగొట్టడమా.?
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల, ఓ పోలీస్ అధికారి చెంప పగలగొట్గారట.!
ఎస్ఐ స్థాయి అధికారి అలాగే, ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ని కూడా కొట్టారట.! ఈ మేరకు హైద్రాబాద్లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద ఆమె మీద కేసు కూడా నమోదయ్యింది.
‘నిరసన మా ప్రాథమిక హక్కు’ అంటారు రాజకీయ నాయకులు. మరి, పోలీసులు వారి విధుల్ని వారు నిర్వహించాలి కదా.?
రాజకీయ నాయకులు హద్దులు మీరితే, పోలీసులు అదుపులోకి తీసుకోవాలి. కానీ, పోలీసులపై రాజకీయ నాయకులు జులుం ప్రదర్శిస్తూనే వున్నారు.
పోలీసులు ఏం చేయాలి.?
ప్చ్.. ఏం చేయడానికి లేదు. ఎందుకంటే, ఎవరి మీదన్నా కఠిన చర్యలు తీసుకుంటే, ఆయా పోలీసుల ఖర్మ కాలిపోయి.. ఆయా రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చేసి కక్ష సాధింపు చర్యలు చేపడతారు.
ట్రాన్స్ఫర్లు, సస్పెన్షన్లు.. అడ్డదిడ్డంగా కేసులు పెట్టించి, ఉద్యోగానికి దూరంగా వుంచడాలు.. చాలానే చేస్తుంటారు రాజకీయ నాయకులు.
తప్పదు.. ఎవరికైనా సెట్యూట్ చేయాల్సిందే.. వంగి వంగి దండాలు పెట్టాల్సిందే.. ఇలా తయారైంది పోలీసు వ్యవస్త కూడా.!
Also Read: నాన్నంటే నరకం: బాంబు పేల్చిన సీనియర్ నటి ఖుష్బూ!
సామాన్యులపై పెట్రేగిపోయే పోలీసులు, రాజకీయ నాయకుల ముందు మాత్రం పిల్లుల్లా మారిపోతారన్నది నిష్టురసత్యం.!
రాజకీయ నాయకులెవరైనాసరే.. పోలీసుల మీద చెయ్యి చేసుకోకూడదు. అలా కాదని చెయ్యి చేసుకుంటే, అసలంటూ రాజకీయాలకు పనికిరాకుండా వారిపై వేటు వెయ్యాలి.!
కానీ, జరిగే పనేనా ఇది.? జరిగితేనే కదా, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో గౌరవం పెరిగేది.?