Ys Sharmila YSRTP Politics.. సుదీర్ఘ పాదయాత్ర.. ఓ మహిళ చేయడం.. దేశ రాజకీయాల్లోనే ఇంతకు ముందెన్నడూ జరగలేదు.! ఈ విషయంలో వైఎస్ షర్మిలని అభినందించి తీరాల్సిందే.
గతంలో తన అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం ఆమె సుదీర్ఘ పాదయాత్ర చేశారు. కానీ, ఆ పాదయాత్ర తాలూకు ఫలాల్ని వైఎస్ జగన్ మాత్రమే అందుకున్నారు.
ప్చ్.. తెలంగాణలో వైఎస్ షర్మిల చేసిన పాదయాత్రకీ ‘ఫలాలు’ దక్కలేదు.! ఇక, సొంత రాజకీయ పార్టీ నడపలేనన్న నిర్ణయానికి వచ్చి, కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు వైఎస్ షర్మిల.
Ys Sharmila YSRTP Politics.. ఎందుకిలా.?
రాజకీయ పార్టీ నడపడమంటే ఈ రోజుల్లో చిన్న విషయం కాదు.! దానికి చాలా చేయాలి.! ఓటర్లను కొనాలి.. నాయకుల్ని కొనాలి.. ఇంకా ఇంకా చాలా చాలా చాలా చేయాల్సి వుంటుంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కాలం కలిసొచ్చింది. వైఎస్ షర్మిలకు అలా కాలం కలిసొచ్చే పరిస్థితి లేదు.
రాజకీయాల నుంచి తప్పుకోలేక.. అన్న పార్టీలోకి వెళ్ళలేక.. వైఎస్ షర్మిల రాజకీయం అయోమయంలో పడిపోయింది.
కాంగ్రెస్ ఆహ్వానం మేరకు..
తొలుత బీజేపీ (BJP) వైపుగా వైఎస్ షర్మిల (Ys Sharmila) ప్రయాణం సాగినా, ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీ తలుపు తట్టారు.
విలీన ప్రక్రియ.. జస్ట్ లాంఛనం మాత్రమే.! కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిపోతున్నారు. అంటే, వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండా పీకేస్తున్నారన్నమాట.
కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల తన పార్టీని అమ్మేస్తున్నారని అనడం సబబు కాదు.! చిరంజీవి విషయంలో ఇలాంటి ‘లేకి’ విమర్శలు చాలామంది చేస్తుంటారు.
Also Read: కొత్త ఒక వింత.! ‘బ్రిక్ బిర్యానీ’ తెలుసా మీకు.?
అంతా బాగానే వుందిగానీ, వైసీపీకి బద్ధ శతృవు కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీలోకి వైఎస్ షర్మిల వెళ్ళిపోతున్న దరిమిలా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆలోచనలు ఎలా వుండబోతున్నాయ్.?
అన్నకు వ్యతిరేకంగా చెల్లెలు రాజకీయం చేయగలరా.? చెల్లెలిపై రాజకీయ పోరాటానికి అన్న వైఎస్ జగన్ సమాయత్తమవుతారా.? వేచి చూడాల్సిందే.