Ys Vivekananda Reddy Mystery వైఎస్ వివేకానంద రెడ్డి.. ఈ పేరుకి కొత్తగా పరిచయం అవసరం లేదు.! దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సోదరుడు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు.!
‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ, వైఎస్ వివేకా హత్యని టీడీపీ మీదకు నెట్టేసింది అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 2019 ఎన్నికల సమయంలో ఈ హత్య రాజకీయంగా పెను ప్రకంపనలకు కారణమైంది.
ఇప్పుడేమో, వైఎస్ వివేకా హత్యకి ఆయన కుటుంబ సభ్యులే.. అందునా కుమార్తె, అల్లుడే కారణమని వైసీపీ ఆరోపిస్తోంది. ఇంతకీ, వైఎస్ వివేకాని ఎవరు చంపారు.?
సాదా సీదా రాజకీయ నాయకుడు కాదు వైఎస్ వివేకానంద రెడ్డి..
ఎంపీగా పనిచేశారు.. మంత్రిగా సేవలందించారు.. కానీ, ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీనే.!
దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయ్.? ఈ జుగుప్సాకరమైన రాజకీయమేంటి.?
హూ కిల్డ్ బాబాయ్.! భౌతికంగా చంపేశారు సరే.. చచ్చిపోయిన వ్యక్తిపై ఈ జుగుప్సాకరమైన ఆరోపణలేంటి.?
రెండో పెళ్ళి గోల ఇప్పుడే ఎందుకు తెరపైకొచ్చింది.? అది నిజమేనా.?
నాశనమవుతున్నది ‘వైఎస్’ బ్రాండ్ ఇమేజ్.!
కుమార్తె, అల్లుడిపైనా.. కొడుకు లాంటోడిపైనా ఆరోపణలు.. అసలు కుట్ర ఎవరిది.?
నారాసుర రక్త చరిత్ర కాస్తా.. ‘వైఎస్’ కుటుంబ రక్త చరిత్రగా ఎందుకు మారింది.?
Mudra369
నాలుగేళ్ళు పూర్తయ్యింది.. ఇంతవరకు వైఎస్ వివేకాని (Ys Vivekananda Reddy) ఎవరు చంపారు.? ఎందుకు చంపారు.? అన్న విషయాల్ని సిట్, సీబీఐ సైతం వెలికి తీయలేకపోయాయ్.!
వైఎస్ వివేకా రెండో పెళ్ళి..
కొత్త ఆరోపణ ఇది.! వైఎస్ వివేకానంద రెడ్డి లేటు వయసులో రెండో పెళ్ళి చేసుకున్నారట. ఈ క్రమంలో ఆయన తన పేరుని షేక్ మొహమ్మద్ అక్బర్‌గా మార్చుకున్నారట.
వైసీపీ (YSR Congress Party) ఎంపీ అవినాష్ రెడ్డి (ఈయనకీ బాబాయ్ అవుతారు వివేకా) చేసిన ఆరోపణలివి. ఈ ఆరోపణల్ని వైసీపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
రాజకీయం ఏమైనా చేయగలదు.! అసలు రాజకీయమంటేనే అంత.!
జనం ఏమనుకుంటున్నారన్నది అనవసరం.! నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?
Mudra369
రెండో భార్య ద్వారా ఓ కొడుక్కి తండ్రి అయిన వైఎస్ వివేకా, ఆస్తిపాస్తుల విషయంలో కుమార్తె (సునీతా రెడ్డి) అలాగే అల్లుడితో గొడవ పడ్డాడరట. ఈ క్రమంలోనే హత్య జరిగిందన్నది అవినాష్ రెడ్డి ఆరోపణ.
Ys Vivekananda Reddy Mystery.. తర్వాతేంటి.?
ఇక్కడితో ఆగుతుందా.? కొత్త ఆరోపణ ఇంకేదైనా తెరపైకొస్తుందా.? 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేసేందుకు కడప జిల్లాలో చాలా కష్టపడ్డారు వైఎస్ వివేకా.

ప్రచారం జరుగుతున్న సమయంలోనే వైఎస్ వివేకా (Ys Vivekananda Reddy) దారుణ హత్యకు గురయ్యారు. కానీ, 2006లోనే వివేకా అక్రమ సంబంధం, పెళ్ళి.. అంటూ వైసీపీ ఇప్పుడు కొత్తగా ఆరోపణలు చేస్తోంది.
Also Read: పొలిటికల్ ఎంవోయూ.! నిజం.. నేతి బీరకాయ్.!
రాజకీయం అంటేనే ఇంత.1 కానీ, మరీ ఇంత దారుణమా.? ఏమో, ముందు ముందు ఇంకెలాంటి జగుప్సాకరమైన రాజకీయాలు తెరపైకొస్తాయో.!