Yuzvendra Chahal Dhanashree Verma Row.. యజువేంద్ర చాహల్.. ధనశ్రీ వర్మ.. ఇద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. కానీ, వీరిద్దరి వైవాహిక బంధం ఎక్కువ కాలం సజావుగా సాగలేదు.
కొద్ది రోజుల క్రితమే చాహల్, ధనశ్రీ.. చట్టబద్ధంగా విడిపోయారు. విడాకులు తీసుకున్నాక, ఎవరి దారిన వారున్నారు. క్రికెట్లో చాహల్ బిజీ, కొరియోగ్రాఫర్‌గా ధనశ్రీ బిజీ బిజీ.
తెలుగులోనూ, ఓ సినిమా కోసం ఇటీవల ధనశ్రీ ఆర్య ఓ సాంగ్‌కి కొరియోగ్రఫీ చేసిన సంగతి తెలిసిందే.
Yuzvendra Chahal Dhanashree Verma Row.. తప్పెవరిది.?
ధనశ్రీ వర్మ తాజాగా, ఓ టాక్ షోలో మాట్లాడుతూ, చట్టబద్ధంగా విడిపోయాక, ఒకర్ని ఇంకొకరు గౌరవించుకోకపోయినా ఫర్లేదుగానీ, విమర్శించుకోకూడదని చెప్పింది.
అంతకు ముందు, ఓ సందర్భంలో విడాకులకు కారణం ఎవరన్నదానిపై చాహల్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ జరిగింది.
కేవలం ధనశ్రీ మూర్ఖత్వం వల్లే విడాకులు.. అని, చాహల్ చెప్పినట్లుగా కొన్ని వార్తలు వక్రీకరణకు గురయ్యాయి. దాంతో, ధనశ్రీ నొచ్చుకుంది.
ధనశ్రీ అలా అనడం కరెక్టేనా.?
ఇక, ధనశ్రీ చేసిన వ్యాఖ్యల్నీ నిజానికి తప్పు పట్టలేం. వైవాహిక బంధంలో మనస్పర్ధలు వచ్చే కదా.. ఇద్దరూ విడిపోయింది. నిజానికి, ఇద్దరూ ప్రేమించే పెళ్ళి చేసుకున్నారు కదా.?
విడిపోయాక, ఇద్దరూ సెలబ్రిటీలు కాబట్టి.. మీడియాని ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేయక తప్పదు. మీడియా గుచ్చి గుచ్చి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది.
Also Read: ‘మిరాయ్’ ఇచ్చిన విజయం.! మంచు మనోజ్ సరి కొత్త ప్రయాణం.!
అలా చెప్పే సమాధానాల్లో, ఎక్కడో ఓ చోట.. మీడియాకి కావాల్సిన ‘వైరల్’ కంటెంట్ దొరుకుతుంది. చాహల్ విషయంలోనూ, ధనశ్రీ విషయంలోనూ.. మీడియాకి అలానే ‘కంటెంట్’ దొరికిందన్నమాట.
చాహల్‌ని నేను గౌరవిస్తాను.. అతని మీద ఎలాంటి ద్వేషం కూడా లేదు.. అని ధనశ్రీ తాజాగా చెప్పడం గమనార్హం. చాహల్ కూడా ఓ సందర్భంలో, ధనశ్రీ మీద తనకున్న గౌరవాన్ని చెప్పకనే చెప్పాడు.
