Table of Contents
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Mega Power Star Ram Charan), అందాల చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) నటించిన ‘మగధీర’ (Magadheera 10 Years) సినిమా పదేళ్ళు పూర్తి చేసుకుంది. అప్పటికీ, ఇప్పటికీ.. ఎప్పటికీ ‘ఫ్రెష్’గానే కన్పిస్తుంటుంది ‘మగధీర’ (Magadheera Industry Hit)సినిమా. అదే ఈ వెండితెర అద్భుతం తాలూకు ప్రత్యేకత.
రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూపొందిన ఈ సిల్వర్ స్క్రీన్ వండర్, అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమ గత రికార్డుల్ని తిరగరాసేసిన విషయం విదితమే. చాన్నాళ్ళు ‘మగధీర’ (Magdheera) రికార్డు దరిదాపుల్లోకి ఇంకే పెద్ద సినిమా వెళ్ళలేకపోయిందంటే.. ఆ సినిమా సాధించిన విజయం అలాంటిది మరి.
ఇన్నేళ్ళ తర్వాత.. ఆనాటి ఆ వెండితెర అద్భుతాన్ని (Magadheera Decade) గుర్తు చేసుకుంటూ సినిమా కోసం పనిచేసిన ప్రముఖులు తమ అనుభవాల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
కాజల్, చరణ్.. చిన్ననాటి సంగతులు..
రామ్‌చరణ్‌కి (Mega Power Star Ram Charan) ‘మగధీర’ రెండో సినిమా మాత్రమే. కాజల్ (Kajal Agarwal) అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినా, ‘మగధీర’తోనే ఆమెకు స్టార్‌డమ్ వచ్చింది. ఆనాటి ఆ విషయాల్ని గుర్తు చేసుకుంటూ, ‘చైల్డ్ హుడ్ మెమరీస్..’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కాజల్ అగర్వాల్.
నిజమే, అప్పటికీ.. ఇప్పటికీ కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) వయసుతో సంబంధం లేకుండా క్యూట్ అప్పీల్‌ని, గ్లామర్‌నీ మెయిన్‌టెయిన్ చేస్తోంది గనుక.. ఆమె వయసు ఎవరికీ పెద్దగా తెలియలేదుగానీ.. ఇప్పుడు ఆమె ‘చిన్నప్పటి సంగతులు’ అని చెబుతోంటే, ‘అవును కదా..’ అని అంతా అనుకోవాల్సి వస్తోంది. మిత్రవింద పాత్రలో కాజల్ నటన ఈ సినిమాకే పెద్ద హైలైట్.
తండ్రిని మించిన తనయుడయ్యాడు..
చిరంజీవి 150 సినిమాలతో (Mega Star Chiranjeevi) సాధించిన పేరు ప్రఖ్యాతుల్ని చరణ్ ఒకే ఒక్క సినిమాతో సాధించేశాడంటే నమ్మగలమా.? నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే, ‘మగధీర’తో ఆ స్థాయి ప్రశంసలు అందుకున్నాడు రామ్‌చరణ్.
సినిమా మీద మేగ్జిమమ్ నెగెటివిటీని స్పెడ్ చేసేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించారు. సినిమాలో ఓ పాటని వివాదాస్పదం చెయ్యాలనుకున్నారు.. ఇంకా చాలా యాగీ జరిగింది. అవేవీ మగధీర (Decade for Magadheera) సునామీ ముందర గట్టిగా నిలబడలేకపోయాయి.
హేటర్స్ అంతా ముక్కున వేలేసుకున్నారు. రెండో సినిమాతోనే ఇంతటి ఘనవిజయం సాధించుకున్న చరణ్, తండ్రిని మించిన తనయుడన్న ప్రశంసల్ని దక్కించుకున్నాడు.
జక్కన్న తీర్చిదిద్దిన అద్భుతం..
చరణ్ స్టార్‌డమ్ సంగతి పక్కన పెడితే, రాజమౌళి (SS Rajamouli) రేంజ్‌ని పెంచిన చిత్రమిది. తెలుగు తెరపై ఇలాంటి ఓ అద్భుతం చేయొచ్చని నిరూపించడమే కాదు, తెలుగు సినిమా బాక్సాఫీస్ స్టామినాకి నెక్స్‌ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాడు రాజమౌళి.
అయితే, ‘బాహుబలి’ (Baahubali) లాంటి అద్భుతం ‘మగధీర’తోనే రాజమౌళి చేయాలనుకున్నా, కొన్ని ఈక్వేషన్స్ కారణంగా, అప్పట్లో తెలుగుతోపాటు హిందీ సహా ఇతర భాషల్లో రిలీజ్ అవలేకపోయింది మగధీర (Magdheera 10 Years). ఆ ఆవేదన ఇప్పటికీ రాజమౌళిలో అలా వుండిపోయిందనుకోండి.. అది వేరే విషయం.