Table of Contents
18 Pages Review.. హీరో హీరోయిన్లంటే ఎలా వుండాలి.? బాత్రూమ్‌లో నగ్నంగా కలిసి స్నానం చెయ్యాలి.! బెడ్డు మీద మంచం విరిగిపోయేలా విన్యాసాలు చెయ్యాలి.!
అంతేనా.? మూతి ముద్దుల్లో రెచ్చిపోవాలి.. ఇద్దరి పెదాలూ వాచిపోయేలా చీకేసుకోవాలి.! హీరోయిన్ల ఎద యెత్తుల్ని హీరో అభివర్ణించాలి.!
సినిమా రిలీజవగానే.. మంచి చెడుల గురించి మాట్లాడేసుకోవడం కంటే.. ఆ వేడి తగ్గాక.. ప్రశాంతంగా సినిమా చూసి, అందులోని కంటెంట్‌కి కనెక్ట్ అయితే.. ఆ కిక్కే వేరప్పా.!
కానీ, కొన్ని హిట్టు సినిమాలు చిరాకు పెడతాయ్ ఎప్పుడు చూసినా. చాలా అరుదుగా కొన్ని మంచి సినిమాలు.. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తాయ్.
Mudra369
హీరోల మగతనం గురించి హీరోయిన్లు డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పాలి. ఇదీ సినిమా అంటే.! ఫక్తు కమర్షియల్ సినిమా ఫార్మాట్ ఇది.
18 Pages Review.. పద్ధెనిమిది పేజీలు.! ఓ దృశ్య కావ్యం.!
సినిమా ప్రారంభమవుతూనే, హీరోగారేమో తన గర్ల్ ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ ఓ డైలాగ్ పేల్చుతాడు. ‘స్నానం చేస్తున్నావా.? ఏదీ చూడనీ..’ అంటాడు. మనకేమైనా కొత్తా.? అని కూడా అడుగుతాడు.
ఎక్కడో తేడా కొడుతుందే.. అనే అనుమానం కలుగుతుంది. దారి తప్పుతున్న కుర్రాడ్ని, అతని స్నేహితురాలు పక్కకు లాగుతుంది.!
డ్రైనేజీలో పడాల్సినోడు.. అని షాట్ తీశారుగానీ.. పక్కదారి పడుతున్న హీరోని దార్లోకి తెచ్చిందన్నమాట ఆ స్నేహితురాలు.! ఆమె రఫ్‌గా మాట్లాడుతుందిగానీ, నిజానికి మంచి స్నేహితురాలు.

గర్ల్ ఫ్రెండ్ మాత్రం మనోడికి హ్యాండిస్తుంది. అప్పుడే, అతనికి ఓ డైరీ దొరుకుతుంది. అది రాసిన అమ్మాయిని ప్రేమిస్తాడు. రెండేళ్ళ క్రితం ఆమె రాసిన డైరీలోని అక్షరాల్ని.. అతనిప్పుడు అనుభూతి చెందుతుంటాడు.
దృశ్య కావ్యమంటే ఇదే మరి.!
ఎంతటి అద్భుతమిది.? డైలాగ్స్ అందంగా వున్నాయి. సినిమాటోగ్రఫీ ఇంకా అందంగా వుంది. అక్కడక్కడా కొంత బోరింగ్ అనిపించొచ్చు.. కానీ, అదీ అర్థం చేసుకోదగ్గదే.
తగినంత హాస్యం.. అది కూడా డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండానే సుమీ. వెరసి, సినిమా అంతా ప్లెజెంట్‌గా సాగిపోతుంటుంది. చిన్నపాటి యాక్షన్.. అదీ అందంగానే వుంది.
హీరో, హీరోయిన్, స్నేహితురాలు.. అందరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. ఎవరి నటనా ఎక్స్‌ట్రా అనిపించదు.
ప్రేమని.. ప్రేమించిన అమ్మాయికి చెప్పడానికి ఇబ్బంది పడే హీరో.. అప్పటిదాకా హీరోయిన్‌ని వెతుక్కుంటూ వెళ్ళిన హీరో.. అతన్ని ఆ తర్వాత వెతుక్కుంటూ వెళ్ళే హీరోయిన్.. వారెవ్వా.!
క్లయిమాక్స్.. ఇది వేరే లెవల్..
క్లయిమాక్స్‌లో అయితే.. హీరో – హీరోయిన్.. కలిసే సన్నివేశం.! సినిమా ఇంకాస్సేపు వుంటే బావుణ్ణనే ఫీలింగ్.
ఎన్నాళ్ళయ్యిందో ఇలాంటి మంచి సినిమాని చూసి.. అనిపించి, ఇంకోసారి చూసి.. మళ్ళీ మరోమారు చూసి. ఆ అనుభూతిని ఇలా అక్షరాల్లో రాయాలనిపించింది.
నో డౌట్.. హీరో నిఖిల్ కెరీర్‌లో ఎప్పటికీ ఈ సినిమా వెరీ వెరీ స్పెషల్. అనుపమ పరమేశ్వరన్ కూడా అంతే. ఆమె మంచి నటి. గతంలోనూ మంచి పాత్రలు చేసింది. ఇది ఇంకాస్త స్పెషల్.
Also Read: పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి షాక్ అయిన ఆ హీరో ఎవరు.?
ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేలా హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ అవసరం లేదు.. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ పేరుతో ఛండాలం అసలే అవసరం లేదు.
ఇలాంటి సినిమాలు.. తెలుగు సినిమా స్థాయిని పెంచుతాయ్.! దురదృష్టం.. ఇలాంటివాటిని ఆదరించే ప్రేక్షకులూ తక్కువే వుంటారు. వాళ్ళకి కావాల్సింది పైన చెప్పుకున్న మాస్ మసాలా అంశాలే మరి.!
చివరగా.! మొబైల్ ఫోన్లు వాడొద్దంటుందీ సినిమా.! అది సాధ్యమయ్యే పనేనా.? అది లేకపోతే మనిషే లేడన్నట్టు తయారైంది పరిస్థితి మరి.!
– yeSBee