ఇసుక రాజకీయం.! ఇదొక మాఫియా.! ఎనీ డౌట్స్.?

 ఇసుక రాజకీయం.! ఇదొక మాఫియా.! ఎనీ డౌట్స్.?

Free Sand Politics Andhra Pradesh

Sand Politics Andhra Pradesh.. చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి డాష్ గుడిసెలు.! ఔను, రాజకీయ నాయకులు, పార్టీలు.. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులే.! దూరేవి మాత్రం డాష్ గుడిసెలు.! ఇందులో డౌటేముంది.?

ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.! అంతా ఫ్రీ.! ఎన్నికలొస్తే చాలు, ఒంటి మీద సోయ లేకుండా రాజకీయ పార్టీలు ‘ఉచిత’ హామీలు ఇచ్చేస్తుంటారు.

ఇసుక పేరు చెప్పి కోట్లు గడించిన రాజకీయ నాయకులున్నారు.! ఇసుక మాఫియాకి ఎదురెళితే, అధికారుల మీద కూడా ప్రజా ప్రతినిథులు దాడి చేసిన సందర్బాలున్నాయ్.

Mudra369

తాగే నీరు ఉచితంగా వస్తోందా.? లేదు కదా.! అలాంటప్పుడు, బస్సు ప్రయాణం ఎలా ఉచితంగా లభిస్తుంది.? జనం కూడా ఈ విషయమై కాస్త బుర్ర పెట్టి ఆలోచన చేయాలి.

Sand Politics Andhra Pradesh.. భూదేవి ఉచితంగా ఇచ్చే ఇసుక కొనుక్కోవాలిలా..

ఇప్పుడు టాపిక్ ఇసుక గురించి.! అదీ, ఉచిత ఇసుక గురించి.! ఇసుక కొనుక్కోవాల్సి రావడమేంటి.. ఖర్మ కాకపోతే.?

చిన్నప్పుడు, ఎడ్ల బండి మీద, ఓ పెద్దాయన నదిలోకి వెళ్ళి ఇసుక తీసుకొచ్చేవారు.! ఆ ఎడ్లను జాగ్రత్తగా చూసుకోవాలంటే, ఖర్చవుతుంది కదా.?

ఇసుక అంటే జస్ట్ ఇసుక మాత్రమే కాదు.! ఇసుక అంటే, మాఫియా.! ఆ ఇసుక మాఫియా కారణంగా ఎన్ని ప్రాణాలు పోయి వుంటాయ్.. గడచిన పది పదిహేనేళ్ళలో.?

Mudra369

బండి నిర్వహణ, రోజంతా కష్టపడినందుకు.. ఇలా చెప్పుకుంటూ పోతే, కొంత.. సొమ్ము ఆయనా సంపాదించుకోవాలి కదా.?

అలా ‘బండి ఇసుక’కి ఓ రేటు వుండేది.! ఆయనే నదిలోకి వెళ్ళి, ఇసుకని తట్టల్లోకి ఎత్తి, బండిలో వేసుకునేవారు. ఇది కథ కాదు.. వాస్తవం. చాలా ఏళ్ళ క్రిందటి వ్యవహారం.

అత్యాధునిక యంత్రాలతో తోడేస్తూ..

ఇప్పుడేమో, నదీ గర్భంలోకి వెళ్ళి మరీ, అత్యాధునిక యంత్రాలతో ఇసుకని తోడేస్తున్న వైనాన్ని చూస్తున్నాం. మరి, అలా తోడెయ్యడానికి ఖర్చవుతుంది కదా.!

Sand Politics Andhra Pradesh
Sand Politics Andhra Pradesh

ఆ ఖర్చు ఎవరు భరించాలి.? ఇంకెవరు వినియోగదారులే.! అలాంటప్పుడు, ఉచిత ఇసుక.. అన్నదాంట్లో అర్థం ఏముంటుంది.?

స్టాక్ పాయింట్ల దగ్గర ఇసుక ఉచితం.. అంటే, ఆ ‘ఉచితం’ వెనుక కండిషన్స్ అప్లయ్.. ఖచ్చితంగా వుంటుంది. ఫలానా స్టాక్ పాయింట్ దగ్గర ఫలానా మొత్తంలో చెల్లిస్తే, ఇసుక అక్కడి నుంచి బయల్దేరుతుంది.

ఖర్చులుంటాయ్ మరి..

మళ్ళీ స్టాక్ పాయింట్ నుంచి ఇంటికి తెచ్చుకోవడానికీ ట్రాక్టర్ లేదా, ట్రక్కు అవసరమవుతుంది కదా.. ఆ ఖర్చూ అదనం.!

వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాల్ని గడప గడపకీ అందించినట్లు, ఇసుక అయితే అలా ఇంటి వద్ద ఉచితంగా అందించే పరిస్థితి వుండదు కదా.!

ఇసుక రాజకీయం.! ఇది కూడా ఓ ఓటు బ్యాంకు రాజకీయమే.! మరీ, ఇంత దారుణమా.? ప్రజల్ని ఇంతలా మోసం చేయడమా.?

Mudra369

మరి, ఇదంతా తెలిసీ.. ‘ఉచిత ఇసుక’ అనే ప్రకటనని ఎలా చేసినట్టు.? ఎన్నికల వేళ ఎలాంటి హామీలైనా ఇచ్చేస్తాయ్ రాజకీయ పార్టీలు. ఇక్కడా అదే జరిగింది.

Also Read: ఫర్నిచర్ దొంగతనమా.? కోడెలకైనా.. జగన్‌కైనా ఏంటా ఖర్మ.?

నిజానికి, ఇసుక ఉచితమే.. కాకపోతే, హ్యాండ్లింగ్ మరియు రవాణా ఖర్చులుంటాయ్. అవే, తడిసి మోపెడైపోతున్నాయ్.

Digiqole Ad

Related post