2000 Note Banned.. 500 రూపాయల నోటు.. అలాగే 1000 రూపాయల నోటు రద్దయినప్పుడు.. నాతో సహా చాలామంది తొలుత సంతోషించారు. అహో మోదీ.. ఒహో మోదీ.. అన్నారు.!
ఏటీఎంల దగ్గర.. బ్యాంకుల దగ్గర గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చుని, డబ్బులు తెచ్చుకున్న రోజులవి.! అత్యవసరంతో వచ్చి, ప్రాణాలు కోల్పోయినవారెందరో వున్నారు.
రాత్రికి రాత్రి తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం.. ఎన్నో జీవితాల్ని నాశనం చేసిందన్నది నిర్వివాదాంశం.!
ఓ ఐదొందలు వుంటే ఇస్తావా.? అని ఇరుగు పొరుగువారిని అడుక్కోవాల్సిన దుస్థితి చాలామందికి ఎదురయ్యే వుంటుంది.. బ్యాంకుల్లో లక్షలు మురుగుతున్నాసరే, తీసుకోలేని దుస్థితి అది.
2000 Note Banned.. అప్పుడూ వాళ్ళదే పండగ.!
ఆ పెద్ద నోట్ల రద్దు సమయంలో, ‘పెద్దలకు’ మాత్రం తళ తళ మెరిసే కొత్త నోట్లు తేలిగ్గానే దొరికాయి. వందల కోట్ల విలువైన నోట్లు వారికి సులభంగానే అందాయి.
సామాన్యుల పరిస్థితే.. అత్యంత దయనీయంగా మారింది.! మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి 2000 రూపాయల నోటు రద్దుపై ప్రకటన వచ్చింది.
ఈసారి కూడా ‘పెద్ద దొంగలు’ దొరుకుతారు.. విలవిల్లాడుతారు.. అని సామాన్యుడు నమ్ముతున్నాడు. నిజానికి, సామాన్యుడు 2 వేల రూపాయల నోటు చూసి చాలాకాలమే అయ్యింది.! నాతో సహా.!
సో, 2 వేల రూపాయల నోటు రద్దుతో సామాన్యుడికి వున్నపళంగా నష్టమేమీ జరగకపోవచ్చు. కానీ, నమ్మొచ్చా.? పెద్ద దొంగకి దెబ్బ పడితే, ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా సామాన్యుడి మీద పడుతుంది.
పెద్ద నోటు రద్దు ప్రాణాలు తీస్తుందా.?
ఏం జరిగినా, పెద్ద దొంగలైతే ఎప్పుడూ సేఫ్ జోన్‌లోనే వుంటారు. అన్నట్టు, ఇప్పుడున్న 2 వేల రూపాయల నోటుని మార్చుకోడానికి సమయం ఎక్కువే ఇచ్చారు.
Also Read: పొలిటికల్ ఎంవోయూ.! నిజం.. నేతి బీరకాయ్.!
పో, గోదాముల్లో మగ్గుతున్న 2 వేల రూపాయల నోట్ల కట్టలకు విముక్తి పెద్ద కష్టమేమీ కాదన్నమాట.!
ప్రభుత్వాల్ని నమ్మి మోసపోవడం ప్రజలకు కొత్త కాదు. అదే సమయంలో ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకున్నా బాగుపడటం పెద్ద దొంగలకూ అలవాటే.!
ఈసారి పెద్ద నోటు రద్దు అనేది దేశాన్ని ఉద్ధరించకపోయినా ఫర్లేదు.. సామాన్యుల ప్రాణాల్ని తీసెయ్యకపోతే అదే చాలు.!
– yeSBee