Sravana Bhargavi Okapari.. సరిగమలు శ్రావ్యంగా ఆలపించే అద్భుత పాటగత్తెల్లో శ్రావణి భార్గవి కూడా ఒకరు. చాలా సినిమా పాటల్ని అందంగా ఆలపించిందామె.!
ఒకే ఒక్క పాట.. ఆమెను వివాదంలోకి లాగేసింది. నిజానికి, అది పాట కాదు.. అన్నమయ్య కీర్తన. అదే అసలు సమస్య.!
పాట పాడటం వరకూ ఆమెను తప్పు పట్టడానికి వీల్లేదు. అయితే, ఆ పాటలో ఆమె అభినయించేసింది. అందులో కొందరికి ‘ఇంకోదో కోణం’ కనిపించింది.
Sravana Bhargavi Okapari నిజంగానే, అన్నమయ్య కీర్తనలో ‘అది’ వుందా.?
శ్రావణ భార్గవి ఓ అన్నమయ్య కీర్తనను ఆలపించి, వీడియోగా చేసి.. దాన్ని తన యూ ట్యూబ్ ఛానల్‌లో వుంచింది. అందులో ఆమె అభినయం జుగుప్సాకరంగా వుందన్నది ప్రధాన ఆరోపణ.

నిజానికి, మరీ అంత జుగుప్సాకరంగా ఏమీ లేదు, ఆ వీడియో. కానీ, అన్నమయ్య కీర్తన విషయంలో అంత బాధ్యతారాహిత్యంగా ఎలా వ్యవహరించావ్.? అన్నదే శ్రావణ భార్గవి మీద వస్తోన్న ప్రశ్న.
‘ఇందులో తప్పేముంది.?’ అంటూ శ్రావణ భార్గవి ఎదురుదాడికి దిగుతోందనుకోండి.. అది వేరే సంగతి.
మనోభావాలు దెబ్బతిన్నాయ్..
భక్తి పాటల్ని ఐటమ్ సాంగ్స్ కోసం వాడేస్తున్నారు.. దేవాలయాల జాతరల్లో రికార్డింగ్ డాన్సులు అత్యంత అసభ్యకరంగా వేసేస్తున్నారు. అప్పుడెక్కడా అభ్యంతరాలుండటంలేదు.!
కానీ, సినీ సెలబ్రిటీలకు సంబంధించి ప్రతి చిన్న విషయాన్నీ ‘మనోభావాలు’ అనే బూతద్దంలో చూస్తున్నారు కొందరు.
Also Read: నభా నటేష్ ‘డేటింగ్’ పైత్యం.! ఛీ పాడు యాపారం.!
ఇక్కడ, శ్రావణ భార్గవి విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ వివాదం, ఆమె యూ ట్యూబ్ ఛానల్‌కి సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుతోంది. వివాదం లాభం కోసమేనన్నమాట.!
ఎలాగైతేనేం, అన్నమయ్య కీర్తన ‘ఒకపరి’ వివాదాస్పదమయ్యింది.. శ్రావణ భార్గవికి బెదిరింపులు షురూ అయ్యాయి. మనోభావాలూ దెబ్బతిన్నాయ్ కొందరికి.!
వెరసి, ఈ మొత్తం వివాదం శ్రావణ భార్గవికి విపరీతమైన మైలేజ్ తెచ్చిపెట్టాయన్నది నిర్వివాదాంశం.
అదేంటో, మనోభావాలు దెబ్బతినడం ఇటీవలి కాలంలో ఓ ఫ్యాషన్ అయిపోయింది. అందుకేనేమో, సెలబ్రిటీలూ వాటితో ఆడుకోవడానికి తమదైన రీతిలో జిమ్మిక్కులు చేస్తూనే వున్నారు.
ప్రత్యేకించి, హిందూ మత విశ్వాసాలపైనే ఎందుకీ వివాదాలు.? ఎందుకీ పబ్లిసిటీ స్టంట్లు.? అన్నది ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారిపోయింది.