Table of Contents
Rashmika Mandanna National Crush.. తెలుగు సినీ పరిశ్రమలోకి ఓ సంచలనంలా దూసుకొచ్చింది కన్నడ కస్తూరి రష్మిక మండన్న.
కన్నడ సినిమాల నుంచి నేషనల్ క్రష్ అయ్యేక్రమంలో వయా తెలుగు సినీ పరిశ్రమ.. ఆమె సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు.!
స్టార్‌డమ్ రాత్రికి రాత్రి వచ్చేస్తుందేమో.. కానీ, అలా స్టార్‌డమ్ రాత్రికి రాత్రి రావడం వెనుక ఎన్నో కష్టాలుంటాయని చెబుతోంది రష్మిక (Rashmika Mandanna).
చిన్న చిన్న కమర్షియల్ యాడ్స్ దగ్గర్నుంచి, సినిమాల్లో నటించడం.. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్ళు.. వెరసి, రష్మిక జీవితంలోనూ బోల్డన్ని ట్విస్టులున్నాయ్.
లెక్కలూ తెలుసు.. లిమిట్స్ కూడా తెలుసు.!
అందరికన్నా తానే అందగత్తెనన్న ఫీలింగ్ తనకెప్పుడూ వుండదని రష్మిక చెప్పింది. ‘నాకంటే అందగత్తెలు చాలామంది వున్నారు. నాకంటే బాగా నటించేవాళ్ళూ వున్నారు..’ అంటోంది రష్మిక.

కష్టపడితే, దానికి లక్కు తోడైతే సక్సెస్ దానంతట అదే వస్తుందన్న రష్మిక, ఎంత కష్టపడినా లక్కు కలిసి రాకపోతే ఏమీ చేయలేమనీ అభిప్రాయపడింది.
ఇక, గ్లామర్ విషయానికొస్తే.. ‘ఆ లెక్కలు, హద్దులు నాకు తెలుసు..’ అని రష్మిక (Rashmika Mandanna) తనదైన స్టయిల్లో సమాధానమిచ్చింది.
ట్రోల్స్.. నవ్వు తెప్పిస్తాయి, చికాకు కల్గిస్తాయి కూడా.!
నేషనల్ క్రష్.. అనే సూపర్ పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే గుర్తింపు, అదే సమయంలో సోషల్ మీడియాలో కనిపించే భయానకమైన ట్రోలింగ్.. రెండిటినీ తాను అనుభవిస్తున్నానని రష్మిక (Rashmika) చెప్పుకొచ్చింది.
ఒక్కోసారి దారుణమైన ట్రోలింగ్ చికాకు తెప్పిస్తుంటుంది. ఇంకో సందర్భంలో ఈ ట్రోలింగ్ నవ్వు కూడా తెప్పిస్తుంటుంది.. అంటూ తనదైన స్టయిల్లో వ్యాఖ్యానించింది రష్మిక.
Rashmika Mandanna National Crush.. సినిమా.. ఎక్కడైనా ఒక్కటే.!
కన్నడ సినిమా, తెలుగు సినిమా, హిందీ సినిమా, తమిళ సినిమా.. ఇలా తేడాలేవీ వుండవంటున్న రష్మిక (Rashmika Mandanna), ఎక్కడైనా ప్రేక్షాభిమానం ఎక్కటేనని అభిప్రాయపడింది.
Also Read: రమ్యము.. నరేషము.! ఎంత అ‘పవిత్ర’ము.!
ఆయా భాషల్లో మాట్లాడగలగడం, ఆయా భాషల్లో సినిమాలు చేస్తున్నప్పుడు మరింత వెసులుబాటు కల్పిస్తుందని రష్మిక మండన్న చెబుతోంది.