Table of Contents
Megastar Chiranjeevi Telugu Cinema.. నూట యాభైకి పైగా సినిమాలు చేసిన అనుభవం.. తెలుగు సినీ పరిశ్రమలోనే తిరుగులేని ‘హీరోయిజం’.! ఆయనే మెగాస్టార్ చిరంజీవి.
వన్ టూ టెన్.. మెగాస్టార్ చిరంజీవి మాత్రమే.. ఆ తర్వాతే మేం.. అని ఇప్పటి యంగ్ అండ్ డైనమిక్ హీరోలు చాలామంది ఒప్పుకుంటోన్న సత్యం.!
అలాంటి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), ఏదో యధాలాపంగా దర్శకుల మీద ‘తేలిక కామెంట్స’ చేసేస్తారని ఎలా అనుకోగలం.?
ఔను, చిరంజీవి బాధితుడు.!
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన సినిమాలు ఒక్కోసారి ఫ్లాప్ అవుతుంటాయి. కానీ, వాటికి దర్శకుల్ని ఏనాడూ బాధ్యులుగా చేయలేదు చిరంజీవి.

సక్సెస్, ఫెయిల్యూర్.. వీటికి అందరూ బాధ్యత వహించాల్సిందేనంటారు మెగాస్టార్. అందుకే, ఆయన మెగాస్టార్ అయ్యారు.
‘నేను ఈ స్థాయికి వచ్చానంటే, దానికి కారణం నన్ను ఇలా మలచిన దర్శకులే..’ అని సగర్వంగా చిరంజీవి చెబుతారు.
మరి, ఈ జనరేషన్ దర్శకులకు ‘లోటుపాట్లనూ’ ఎత్తి చూపాలి కదా.? కాంబినేషన్ వుంటే చాలు, కథ.. కాకరకాయ్.. అవసరం లేదనే భావనలో చాలామంది దర్శకులున్నారు.
Megastar Chiranjeevi Telugu Cinema.. రెండో రోజే ఎత్తేశారు..
‘ఆచార్య’ సినిమా రెండో రోజు చాలా థియేటర్లలో ఎత్తేశారు. చిరంజీవి (Chiranjeevi) లాంటి మెగాస్టార్‌కి ఇది అవమానకరమైన ఫలితం. అందుకే, ఆయన తాను బాధితుడినని చెప్పారు.
కానీ, బాధపెట్టిందెవరు.? ఇంకెవరు దర్శకుడు కొరటాల శివ (Koratala Siva). సరే, ఈ ఫెయిల్యూర్‌లో చిరంజీవి భాగం కూడా వుందన్నది వేరే చర్చ.
కొరటాల శివని చిరంజీవి, రామ్ చరణ్ (Ramcharan) గట్టిగా నమ్మారు. సినిమా కోసం అవసరమైనవన్నీ సమకూర్చారు. కానీ, కొరటాల శివ, సినిమాని అత్యంత దారుణంగా తెరకెక్కించాడు.
నూట యాభైకి పైగా సినిమాలు చేసిన చిరంజీవి, కొన్ని డిజాస్టర్స్ కూడా చవిచూశారు. అయితే, ఏనాడూ ఆయన ఇంతలా ఆవేదన చెందలేదు. అంతలా బాధపెట్టింది ‘ఆచార్య’ సినిమాని చిరంజీవి.
‘ఆచార్య’ సమస్య కాదిది.!
తెలుగు సినిమా మేలుకోవాలన్నదే చిరంజీవి ఆలోచన. రిలీజ్ డేట్లు, ఇతరత్రా వ్యవహారాలపై ఫోకస్ పెట్టడం కంటే కథల మీద దర్శకులు ఫోకస పెట్టాలన్నది చిరంజీవి సూచన.
Also Read: ప్రేక్షకులు దేవుళ్ళే.! కుప్పిగంతులేస్తే, తాట తీస్తారు సుమీ.!
ఒకటి కాదు రెండు కాదు.. నూట యాభైకి పైగా సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవిగా, పరిశ్రమ బిడ్డగా చిరంజీవి ఓ సూచన చేశారు. దాన్ని దర్శకులు పాటిస్తారా.? ఆత్మవిమర్శ చేసుకుంటారా.? చేసుకుంటే మంచిదే మరి.!