Nagachaitanya Samantha Hard Feelings.. నాగచైతన్య, సమంత మళ్ళీ కలిస్తే ఏమవుతుంది.? ఈ ప్రశ్న చుట్టూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చిత్రమేంటంటే, ఈసారి బాలీవుడ్ కూడా ఈ విషయమై ఆసక్తి ప్రదర్శిస్తోంది.
ఏం, ఎందుకు నాగచైతన్య, సమంత మళ్ళీ కలవకూడదు.? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవడం సహజమే.!
మలైకా అరోరా (Malaika Arora) విడాకులు తీసుకుంది.. కొన్నాళ్ళుగా తన కంటే వయసులో చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో (Arjun Kapoor) సహజీవనం చేస్తోందామె.!
హృతిక్ రోషన్ (Hrithik Roshan) కూడా తన భార్యకి విడాకులిచ్చేశాడు.. ఇంకో పెళ్ళికి సిద్ధమవుతున్నాడు. చెప్పుకుంటూ పోతే, ఈ లిస్టు చాలా చాలా పెద్దదే.
సమంత – నాగచైతన్య మళ్ళీ కలిసి నటిస్తే.?
మా ఇద్దర్నీ ఒకే రూమ్‌లో వుంచితే, పదునైన వస్తువులు దాచెయ్యాలి.. అంటూ సమంత (Samantha) చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అంత వైరం ఈ ఇద్దరి మధ్యా ఏముంది.? అన్న ప్రశ్న రావడంలో వింతేమీ లేదు.

వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యవహారాల్ని పక్కన పెడితే, ఏమో.. సమీప భవిష్యత్తులో నాగచైతన్య (Nagachaitanya Akkineni) తన మాజీ భార్య సమంతతో కలిసి నటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
‘ఏమో, మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందేమో.. వస్తే మాత్రం క్రేజీగా వుంటుంది..’ అని సరదాగా సమాధానమిచ్చాడు నాగచైతన్య (Akkineni Nagachaitanya), మీడియా అడిగిన ఓ ప్రశ్నకి.
Nagachaitanya Samantha Hard Feelings.. నాగచైతన్య కూల్.. సమంత చాలా హాట్.!
నిజానికి, విడాకుల తర్వాత నాగచైతన్య (Akkineni Naga Chaitanya) చాలా కూల్‌గా కనిపిస్తున్నాడు.
‘ఔను, మేమిద్దరం విడిపోయాం. ఆ విషయాన్ని ఇప్పటికే ప్రకటించాం. ఎవరి దారిలో వాళ్ళం వెళుతున్నాం.. దీని గురించి మాట్లాడాల్సింది ఇంకేమీ లేదు..’ అని తేల్చేశాడు.
Also Read: రణ్వీర్ వర్సెస్ షెర్లీన్.! ‘విప్పు’డు.. వివాదం రాజేసుడు.!
‘ఏం జరిగిందో తెలియాల్సినవారందరికీ తెలుసు..’ అనేశాడు తప్ప, నాగచైతన్య ఎక్కడా సమంత (Samantha Ruth Prabhu) మీద ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలూ చేయలేదు.
సమంతకి వున్నట్టుగా, ‘హార్డ్ ఫీలింగ్స్’ నాగచైతన్యలోనూ వున్నా, సమంత (Samantha Prabhu) బయటపెట్టుకున్నట్లుగా, నాగచైతన్య అయితే బయటపెట్డడం లేదు.
