ఫేక్ కలెక్షన్స్: ‘దేవర’ ముందర నువ్వెంత.?
JrNTR Devara Fake Collections.. జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ సినిమా కొద్ది రోజుల క్రితం విడుదలైంది.
జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. భారీ బడ్జెట్‌తో ‘దేవర’ సినిమాని రూపొందించారు. ప్రమోషన్ల కోసం కూడా చాలా చాలా ఎక్కువగానే ఖర్చు చేశారు.. చేస్తూనే వున్నారు.
ప్రమోషన్లు.. అంటే, సినిమా విడుదలకు ముందు, సినిమా విడుదలకు తర్వాత కూడా.! ఔను, సినిమా అత్యద్భుత వసూళ్ళు సాధించిందని చెప్పుకోవడానికి కూడా ఖర్చు చేస్తున్నారు.
JrNTR Devara Fake Collections.. ఈ పంపకాలు దేనికి సంకేతం.?
ఓ సినీ జర్నలిస్టు, వందల కొద్దీ ‘దేవర’ సినిమా టిక్కెట్లను, తన సోషల్ మీడియా హ్యాండిల్ వేదికగా పంచేశాడు… అదీ అతని ఫాలోవర్లకి, సన్నిహితులకీ.
వెబ్ సైట్ ఒకటి, వేలల్లో ‘దేవర’ సినిమా టిక్కెట్లను, అటు సోషల్ మీడియా వేదికగానూ, ఇటు ఆఫ్‌లైన్‌లోనూ.. ఉచితంగా పంచేయడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ ఇలా ఉచిత టిక్కెట్ల పంపకం జరిగింది.. తెరచాటున.! ఓవర్‌సీస్‌లో పరిస్థితి ఇంకా టూమచ్.!
ఏంటీ, ఇదంతా ఇంతకు ముందెప్పుడూ జరగని వ్వవహారమా.? అంటే, జరిగింది.. కానీ, మరీ ఇంతలా కాదు.! సినిమా ప్రమోషన్ కోసం కొంత చేయాల్సి వుంటుంది కానీ, ఇంత అతి మాత్రం.. ఇదే తొలిసారి.
ఇంతలా, ఉచితంగా టిక్కెట్లు పంచేశాక.. వసూళ్ళ మాటేమిటి.? నెంబర్లకేం, ఎలాగైనా వేసేసుకోవచ్చు. నిజానికి, తొలి రోజు వచ్చిన డిజాస్టర్ టాక్‌కీ వచ్చిన వసూళ్ళకీ పొంతనే లేదు.
డిజాస్టర్ పబ్లిసిటీ స్టంట్..
వచ్చిన వసూళ్ళతో సంతృప్తి పడి వుంటే, సినిమా ‘యావరేజ్’ అన్న భావన అయినా కలిగి వుండేది. కానీ, ఫేక్ వసూళ్ళు చూపించడంతో, డిజాస్టర్.. అనే టాక్.. జనాల్లోకి బలంగా వెళ్ళిపోయింది.
Also Read: డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల: ఏదిరా నీ బాల్యం?
ఏ థియేటర్లో ఎంత వసూలయ్యిందీ.. ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ వచ్చేస్తోంటే.. ఇంకా ‘దేవర’ సినిమా విషయమై ఈ ఫేక్ నంబర్స్ వల్ల ఏం ప్రయోజనం.?
బుక్ మై షోలో తొలి రోజే, షోలు ఫుల్ అవకపోవడమంటే.. అది జూనియర్ ఎన్టీయార్ లాంటి హీరోకి అవమానకరమైన విషయమే కదా.!
ఇంత జరుగుతున్నా.. ‘దేవర’ టీమ్ అస్సలు తగ్గట్లేదు.! ఎందుకిలా.? ఎవరి పైత్యమిది.? జూనియర్ ఎన్టీయార్ అత్యుత్సాహం చూపిస్తున్నాడా.? కొరటాల శివ పైత్యమేనా.?