Table of Contents
చావాలా.? బతకాలా.? ఇలా వుంది కొందరి పరిస్థితి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా విడుదల తర్వాత. అతిశయోక్తి అయినా నిజ్జంగా నిజమే అనిపిస్తోంది కొందరి పరిస్థితి చూస్తోంటే.
ఎలాగైనా, సినిమా మీద నెగెటివ్ టాక్ తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు కొందరు. ఏం లాభం వాళ్ళకి ‘గాడ్ పాదర్’ సినిమా ఫ్లాప్ అయితే.? లాభమేమీ లేదు, పైశాచిక ఆనందం దొరికేదంతే.
ఈ కష్టం పగవాడిక్కూడా రాకూడదు.. అనే స్థాయిలో వాళ్ళంతా కష్టపడ్డారు. సినిమా రంగంలో సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువ. ఇది అందరికీ తెలిసిన విషయమే.
Megastar Chiranjeevi కెరీర్‌లో ఫ్లాపులే లేవా.?
మెగాస్టార్ చిరంజీవి 150కి పైగా సినిమాల్లో నటించారు. అందులో కొన్ని ఫ్లాపులు కూడా వున్నాయ్.! అయితే ఏంటట.?
‘ఆచార్య’ సరిగ్గా ఆడలేదు. చిరంజీవికి (Chiranjeevi) వచ్చే నష్టమేంటి.? ‘గాడ్ ఫాదర్’ హిట్ టాక్ సొంతం చేసుకుంది.. దీని వల్ల చిరంజీవికి అదనంగా వచ్చే ప్రయోజనమేంటి.?
నూట యాభైకి పైగా సినిమాలు చేసిన చిరంజీవి, సక్సెస్ అలాగే ఫెయిల్యూర్‌కి అతీతంగా ఆలోచించగలరు. కానీ, పైన చెప్పుకున్న బ్యాచ్ పరిస్థితి అది కాదు.!
రాత.. రోత.! రేటింగు.. బోకింగు.!
ఓ సినిమాని తామే చంపేయగలమనుకుంటారు. ఎవరూ సినిమాని చంపెయ్యలేరు, ఎవరూ సినిమాని హిట్ చేసెయ్యలేరు. ఆ సినిమాలో దమ్ముండాలంతే.

విషయం వుంటేనే సినిమా ఆడుతుందనీ, తన సినిమా అయినా విషయం లేకపోతే రెండో రోజు లేపేస్తారన్న వాస్తవాన్ని చిరంజీవే స్వయంగా ఒప్పుకున్నారు.
రివ్యూ చూస్తే, దానికిచ్చే రేటింగ్ జస్ట్ ‘ఒకటి’ మాత్రమే.. అదీ ఔటాఫ్ ఫైవ్.! రేటింగ్ మాత్రం రెండూ ముప్పావలా.! చాలా వెబ్‌సైట్లలో ఇదే రేటింగ్ కామన్‌గా కనిపించింది.
Also Read: చిరంజీవి వర్సెస్ కృష్ణంరాజు.! మొగల్తూరు మొనగాడెవ్వరు.?
అన్నట్టు, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విజయాన్ని అందుకున్న రాజమౌళి సెల్యూలాయిడ్ వండర్ ‘ఆర్ఆర్ఆర్’కి ఈ మహానుభావులే రెండున్నర రేటింగులిచ్చారు.
శాడిజం.. అంతకు మించి..
రేటింగులతో సినిమాలు ఆడతాయా.? నాన్సెన్స్.! అయినా, ఏదో కక్కుర్తి, ఇంకోటేదో శాడిజం.
వీళ్ళ రివ్యూలతోనే సినిమాలు ఆడేస్తున్నట్లు.. వీళ్ళేదో సినిమా పరిశ్రమను తమ భుజాల మీద నడిపించేస్తున్నట్లు.. అదో పైశాచిక మాయా లోకంలో విహరిస్తుంటారంతే.
చివరగా.. వీళ్ళకి బుద్ధి ఏనాడైనా వస్తుందా.? ఛాన్సే లేదు. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాకీ ఏడ్చారు. ‘సైరా’కీ ఏడ్చారు. ‘ఆచార్య’కీ ఏడ్చారు. ‘గాడ్ ఫాదర్’కీ అదే పని. రేప్పొద్దున్న ఇంకో సినిమాకీ ఏడవాలి కదా.!
ఏడవకపోతే వీళ్ళ బతుకులు తెల్లారవంతే.