Table of Contents
KCR Telangana.. తెలుగు ప్రజలం.. ఒక రాష్ట్రంలా కలిసి వుండలేకపోయాం.! రెండు రాష్ట్రాలుగా విడిపోయాక మాత్రం కలిసి మెలిసే వుంటున్నాం. ఏం, ఎందుకు.? ఒకే రాష్ట్రంగా ఎందుకు కలిసి వుండకూడదు.?
ఒకే రాష్ట్రంగా కలిసి వుంటే, దేశంలో బలమైన రాష్ట్రంగా వుండేవాళ్ళం కదా.? లోక్ సభ సీట్ల పరంగా.. కేంద్రంపై ఏ విషయంలో అయినా తెలుగు నేల ఒత్తిడి చేయగలిగేలా వుండేది కదా.?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి స్థానంలో భారత్ రాష్ట్ర సమితిని తీసుకొస్తున్న నేపథ్యంలో, తెలుగు నేలపై సరికొత్త రాజకీయం గురించిన చర్చ షురూ అయ్యింది.
KCR Telangana జాతి నాయకుడు.. జాతీయ నాయకుడైతే..
తెలంగాణ జాతికి మాత్రమే నాయకుడు కేసీయార్.. అన్నట్లుగా ప్రొజెక్షన్ గతంలో జరిగింది. కేవలం తెలంగాణ ప్రయోజనాల గురించే కేసీయార్ అప్పట్లో ఆలోచించారు.
ఓ రాష్ట్రంలో కేవలం ఓ ప్రాంత ప్రయోజనాల గురించి మాత్రమే అప్పట్లో ఆలోచించగలిగిన కేసీయార్, ఇప్పుడు దేశ ప్రయోజనాల్ని కాపాడే నాయకుడిగా ఎదగబోతున్నారంటే, నమ్మేదెలా.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది.
ఏం ఎందుకు కాకూడదు.? రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతి వ్యూహాలుంటాయ్.. నాయకుడిగా ఎదిగే క్రమంలో తెలంగాణ అంశాన్ని భుజానికెత్తుకున్నారు.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.
ఆ లెక్కన, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి.. కఠినమైన లక్ష్యాన్ని ముద్దాడిన కేసీయార్, దేశానికి నాయకుడైతే.. దేశ భవిష్యత్తు కూడా సరికొత్తగా మారొచ్చు.
గతం గతః ఇప్పుడేమిటి.?
గతం అప్రస్తుతం.! ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేసీయార్ ఆలోచనలేమిటి.? ఆంధ్రప్రదేశ్ రాజధాని, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా.. వీటన్నిటిపైనా కేసీయార్ తన నిబద్ధతని చాటుకోవాలి.
దేశ ప్రయోజనాలంటే, దేశంలో అన్ని రాష్ట్రాల ప్రయోజనాలని అర్థం. మరి, కేసీయార్ అంత గొప్పగా ఆలోచన చేయగలుగుతారా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
అంత వీజీ కాదు.!
దేశీ కీ నేతా అనిపించుకోవడం.. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చినంత తేలిక కాదు.!అలాగని కేసీయార్‌కి అది అసాధ్యమనడమూ సబబు కాదు.
తెలంగాణ ఉద్యమ సారధి ఆయన.. అసాధ్యమనుకున్నదాన్ని సుసాధ్యం చేయగలిగారు. కానీ, రాష్ట్ర రాజకీయం వేరు.. జాతీయ రాజకీయం వేరు. అదే అసలు సమస్య.
Also Read: బహిరంగ సభలో జగన్.! కార్టూన్‌తో పవన్.!
ఉత్తరాది పెత్తనాన్ని అధిగమించాలంటే, దక్షిణాదికి దేశ పగ్గాలు రావాలంటే అదంత తేలిక కాదు. అన్నిటికీ మించి సొంత గడ్డపై.. అదీ తెలుగు నేలపై.. కుల, ప్రాంత, మత రాజకీయాల్ని కేసీయార్ తట్టుకోగలగాలి.!