అల్లు అర్జున్ చేతికి వైసీపీ పగ్గాలు.?
Allu Arjun YSRCP Duty.. అదేంటీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అల్లు అర్జున్ చేతికి ఎందుకు వస్తాయ్.? ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.!
గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ కోసం అలుపెరుగని పోరాటం చేస్తోంది వైసీపీ సోషల్ మీడియా సైన్యం.! తమ హీరో అల్లు అర్జున్ అనీ, ఆయనకు తామున్నామంటూ వైసీపీ సోషల్ మీడియా ‘ఆర్మీ’ కాస్తా, ‘అల్లు అర్జున్ ఆర్మీ’లో కలిసిపోయింది.
అల్లు అర్జున్ అంటే, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖకి మేనల్లుడు.! అంటే, మెగా హీరో.! నా వెనుకున్న బలం, బలగం.. మెగాభిమానులేనని చాలా సార్లు చెప్పాడాయన.
Allu Arjun YSRCP Duty.. అల్లు అర్జున్ ఆర్మీ.. ఇదో వెటకారం.!
కానీ, అది గతం. గత కొంతకాలంగా అల్లు అర్జున్ సొంత ‘ఆర్మీ’ని తయారు చేసుకున్నాడు. ‘అభిమానుల్ని చూసి హీరోనయ్యాను’ అంటూ అర్థం పర్థం లేని మాటలు చెబుతున్నాడు.
ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ చెబుతున్న అర్థం పర్థం లేని మాటల్ని చూస్తోంటే, జగన్‌తో ఆయనకు వేవ్‌లెంగ్త్ సెట్ అయినట్లుగానే అనిపిస్తోంది.
ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం తనవంతు ప్రయత్నం చేశాడు అల్లు అర్జున్. సదరు వైసీపీ అభ్యర్థి శిల్పా రవి, అల్లు అర్జున్‌కి స్నేహితుడట.
ఆ శిల్పా రవి, అల్లు అర్జున్ కొత్త సినిమా ‘పుష్ప 2 ది రూల్’ కోసం వైసీపీ అభిమానుల్ని మోహరిస్తున్నాడు కూడా.! ఇచ్చి పుచ్చుకోవడం.. అంటారు కదా.. అలాంటిదే ఇది.!
అల్లు అర్జున్ మీద చెలరేగిపోతారు.. జర జాగ్రత్త.!
అయినా, ఎన్నాళ్ళు వైసీపీ క్యాడర్, అల్లు అర్జున్‌ని మోస్తుంది.? ‘పుష్ప 2 ది రూల్’ సినిమా రిలీజ్ నేపథ్యంలో టిక్కెట్ల హైక్ కోసం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని అల్లు అర్జున్ కలిస్తే, సీన్ మారిపోతుంది.
ఇక, అప్పుడు.. ఈ వైసీపీ క్యాడర్ అంతా, తొలుత తిట్టేది అల్లు అర్జున్‌నే.! అల్లు అర్జున్ కుటుంబ సభ్యులపై జుగుప్సాకరమైన ట్రోలింగ్ చేస్తుంది వైసీపీ క్యాడర్. వాళ్ళకి అలవాటైన విద్యే అది.
పిక్చర్ ఇంత క్లియర్‌గా కనిపిస్తోంటే, వైసీపీ పగ్గాలు అల్లు అర్జున్ చేతికి ఎలా వస్తాయ్.? రావు గాక రావు.!
Also Read: బజ్‌ఇవ్వలేదు.! బాక్సాఫీస్ వసూళ్ళయినా ఇస్తావా.?
కానీ, వైసీపీ అభిమానులు ఈ మధ్యకాలంలో ‘పుష్ప 2 ది రూల్’ సినిమా కోసం చేస్తున్న ‘డ్యూటీ’ చూస్తోంటే, అల్లు అర్జున్ వైసీపీ పగ్గాలు చేపడతారనే అనుమానం కలగకమానదు.
నిజానికి, వైసీపీ క్యాడర్ అంతా చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా ఎవర్నయినా నిలబెట్టేందుకు నానా తంటాలూ పడుతుంటుంది.. అలాంటివాళ్ళ కోసం స్పెషల్ డ్యూటీ కూడా చేస్తుంది. అదో పైశిచికానందం అంతే.!