‘గాడ్ పాదర్’ (Godfather) అభిమానులూ పండగ చేస్కోండి.! ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నయనతార (Nayanthara) ఎట్టకేలకు మౌనం వీడింది.!
కొన్నాళ్ళ క్రితం ఓ సినీ పెద్దాయన.. అదేనండీ, దాసరి నారాయణరావు ‘హీరోయిన్లు సినిమాల్ని ప్రమోట్ చేయడానికి ముందుకు రావట్లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు గుర్తుందా.?
అదేంటీ, తాము నటించిన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడం హీరోయిన్ల బాధ్యత కదా.! బాధ్యతా లేదు, బీరకాయా లేదు. నయనతార మాత్రం తన సినిమాల్ని ప్రమోట్ చేయదు.
లేడీ సూపర్ స్టార్ కదా.! అదీ ఆ పొగరుకి కారణం.!
నయనతారది పొగరు అనుకోవాలా.? లేడీ సూపర్ స్టార్‌ని గనుక తాను ఏం చేసినా చెల్లుతుందనుకోవాలా.? ఏదో ఒకటి అనుకోండి, అది మీ ఇష్టం. నయనతార మాత్రం తగ్గేదే లే అంటోంది.

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సినిమా కావొచ్చు.. ఇంకా అంతకన్నా పేద్ధ హీరోతో సినిమా అయినా కావొచ్చు, నయనతార రూటే సెపరేటు.!
నిర్మాత, ఆమెకు రెమ్యునరేషన్ ఇవ్వడం వరకే పని. దర్శకుడు ఆమెతో సినిమా పూర్తి చేయడం వరకే పని. ఆ తర్వాత ఆ సినిమాతో నయనతారకేమీ సంబంధం వుండదు.
Nayanthara ఇలాగైతే ఎలా.?
ఎలాగేంటీ.. నయనతార కెరీర్ మూడు పువ్వులు, ముప్ఫయ్ ఆరు కాయల్లా అద్భుతంగా కొనసాగుతోంది కదా.! పైగా, ఆమె ఇప్పుడు హయ్యస్ట్ పెయిడ్ యాక్ట్రెస్.. అని కూడా అంటారు.
డబ్బులెవరికీ ఊరకనే రావని ఓ గుండాయన చెబుతుంటాడు. నయనతారకు మాత్రం ఊరకనే వస్తాయేమో.. అని అంతా ముక్కున వేలేసుకుంటుంటారు.
ఎలాగైతేనేం, ‘గాడ్ ఫాదర్’ సినిమాపై నయనతార స్పందించింది.. ఓ ప్రకటన విడుదల చేసింది. అదీ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన రెండ్రోజుల తర్వాత.
Also Read: Anasuya Bharadwaj ‘నవస్త్ర’.. అసలు అర్థం తెలుసా.!
పండగ చేస్కోండంతే.! నయనతార మేడమ్.. కాదు కాదు, రాణి నయనతార స్పందించడమంటే మాటలా.?
అన్నట్టు, ‘గాడ్ ఫాదర్’ సినిమాని నయనతార ప్రమోట్ చేసి వుంటే, దాని వల్ల అదనపు ప్రయోజనం ఆ చిత్రానికి ఏమైనా వుంటుందా.? అన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి.
కానీ, సినిమాని ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత అందరు నటీనటుల్లానే, నయనతార మీద కూడా వుంది.