Panja Vaishnav Tej Aadikeshava.. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు.
‘ఉప్పెన’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ మెగా హీరో, తాజాగా ‘ఆదికేశవ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
‘ఆదికేశవ’ టీమ్ తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ప్రోమో విడుదల చేసింది. పంజా వైష్ణవ్ తేజ్ సూపర్ మాస్ లుక్‌తో కనిపిస్తున్నాడు ఈ సినిమాలో.
Panja Vaishnav Tej Aadikeshava.. ఎంత పెద్ద నేరం చేశాడంటే.!
మాస్ గెటప్‌లో కనిపించడమే పెద్ద నేరమైపోయిందిప్పుడు.! ఔను, వైష్ణవ్ తేజ్ మీద ఓ సెక్షన్ మీడియా అప్పుడే నెగెటివిటీ షురూ చేసింది.
పాత చింతకాయ పచ్చడనీ.. ఇంకోటనీ.. ‘ఆదికేశవ’ సినిమాపై దుష్ప్రచారం మొదలు పెట్టేశారు.
ఇప్పటిదాకా పలు భిన్నమైన కథ, కథనాలతో కూడిన సినిమాలు చేశాడు వైష్ణవ్ తేజ్. ఆ కోణంలో చూస్తే, ‘ఆదికేశవ’ హీరోగా అతనికో డిఫరెంట్ అటెంప్ట్ అయ్యే అవకాశముంది.
‘రుద్ర కాళేశ్వర్ రెడ్డి’ అనే పేరు వినపడింది ఈ సినిమాలో. హీరో పేరు అదేనా.? అంతే అయ్యుండొచ్చు.!
మరి, ‘ఆదికేశవ’ (Aadi Keshava) అని టైటిల్ ఎందుకు పెట్టినట్లు.? అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.!
మైనింగ్ మాఫియా.. అంటే ఎక్కడో కాలుద్ది మరి.!
మైనింగ్ మాఫియా… అనగానే, సోకాల్డ్ ‘గ్రేట్’ మీడియాకి ఎక్కడో కాలిపోయినట్టుంది.! అదీ అసలు సమస్య. పైగా, ‘మెగా’ అంటే ఎప్పుడూ వుండే మంటే అది ఆ సెక్షన్ మీడియాకి.!
అన్నట్టు, ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్.! పనిగట్టుకుని కొందరు ఏడిచే ఏడుపుని పక్కన పెడితే మాస్ లుక్‌లో కుర్రాడు అదరగొట్టేశాడు.
Also Read: RIP Ram Gopal Varma.. ఈ రిప్పు గోలేంట్రా ‘వోడ్కా’ ఎర్రి పప్పూ!
భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ ‘ఆదికేశవ’ కోసం డిజైన్ చేసినట్లున్నారు. మైనింగ్ మాఫియా మీద గూబ గుయ్యిమనేలా పవర్ ఫుల్ డైలాగులకీ ఆస్కారమున్నట్టుంది.!
‘ఉప్పెన’, ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’.. ఈ మూడూ దేనికదే చాలా భిన్నమైన సినిమాలు.! ఈసారి పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్ అన్నమాట.!
కటౌట్ చూస్తే మాత్రం, బాక్సాఫీస్‌ని శాసించే మెగా మాస్ హీరో.. అన్నట్టే కనిపిస్తున్నాడు. మీడియా ముసుగులో సోకాల్డ్ మీడియా ఇంతలా ఈ సినిమాపై ఏడుస్తోందంటే, వైష్ణవ్ తేజ్ (Panja Vaishnav Tej).. ఆల్రెడీ హిట్టు కొట్టేసినట్టే.!