Kangana Ranaut.. వెండితెరపై ‘క్వీన్’ ఆమె. రాజకీయాల్లో లీడర్ అవుతుందా.? ఏం, ఎందుకు అవకూడదు.? సినీ నటి జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి అవలేదా.?
రాజకీయాల్లో ఎంతోమంది నటీమణులు రాణించారు, రాణిస్తున్నారు కూడా. ఆ కోవలో కంగనా రనౌత్ పేరు కూడా త్వరలోనే మార్మోగిపోవచ్చు.
ఇటీవల హిమాచల్ ప్రదేశ్ పర్యటన సందర్భంగా కంగనా రనౌత్, తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
Kangana Ranaut.. హిమాచల్ నుంచే పొలిటికల్ జర్నీ..
రాజకీయాల్లోకి రావడమంటూ జరిగితే అది హిమాచల్ ప్రదేశ్ నుంచే జరుగుతుందనీ, భారతీయ జనతా పార్టీ నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తాననీ కంగనా రనౌత్ చెప్పింది.
పోటీ చేయబోయే నియోజకవర్గం గురించి కూడా చెప్పిన కంగన, వచ్చే ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేసే అవకాశం వస్తే, అవకాశం వదులుకోనని కూడా స్పష్టతనిచ్చేసింది.

ఇంతకీ కంగనా రనౌత్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తుంది.? అన్నీ కుదిరితే 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని అంటోందిగానీ.. అలా అన్నీ ఎప్పుడు కుదురుతాయన్నదానిపై మాత్రం సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది.
బీజేపీకి మద్దతుగా..
గత కొంతకాలంగా బీజేపీకి మద్దతుగా పనిచేస్తోంది కంగనా రనౌత్. బీజేపీ భావజాలాన్ని నరనరానా నింపేసుకుంది ఈ బాలీవుడ్ క్వీన్.
Also Read: Anasuya Bharadwaj ‘నవస్త్ర’.. అసలు అర్థం తెలుసా.!
అందులో తప్పేముంది.? బీజేపీ పట్ల ఆమె ఆకర్షితురాలయ్యింది. సో, బీజేపీలో ఆమె చేరడం లాంఛనమే.! కానీ, కంగన రాజకీయాల్లో రాణిస్తుందా.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.!