‘లైగర్’ హీరో.! ‘యానిమల్’ బ్యూటీ.! కాంబినేషన్ కెవ్వు కేక.!

 ‘లైగర్’ హీరో.! ‘యానిమల్’ బ్యూటీ.! కాంబినేషన్ కెవ్వు కేక.!

Tripti Dimri

Tripti Dimri Vijay Deverakonda.. లైగర్ సినిమా.. విజయ్ దేవరకొండ కెరీర్ మొత్తానికీ ఓ పీడకల.! హిట్లు, ఫ్లాపులు ఎవరికైనా సహజమే.!

కానీ, ఓ సినిమాని మర్చిపోవాల్సి వస్తే.. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన కెరీర్‌లో ఖచ్చితంగా ‘లైగర్’ అనే సినిమాని మర్చిపోతాడేమో.!

మామూలుగా అయితే, ‘రౌడీ’ హీరో అంటాం విజయ్ దేవరకొండని. అతని ఆటిట్యూడ్‌కి తగ్గ పేరు అతని అభిమానులే పెట్టారు.

కాదు కాదు, తనను తాను ‘రౌడీ’గా ప్రమోట్ చేసుకుంటుంటాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). అదే సినీ మ్యాజిక్.!

Tripti Dimri Vijay Deverakonda.. ఆమెని తప్పించి.. ఈమెని తీసుకొచ్చారు.!

అసలు విషయానికొస్తే, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమా నుంచి హీరోయిన్‌ని తప్పించేశారట.!

తప్పించబడిన హీరోయిన్ శ్రీలీల అని అంటున్నారు. మరి, శ్రీలీల (Sreeleela) ప్లేస్‌లోకి ఎవర్ని తీసుకొస్తున్నారబ్బా.? ఇంకెవర్ని బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రిని.!

Vijay Deverakonda
Vijay Deverakonda

‘యానిమల్’ (Animal Movie) సినిమాతో రాత్రికి రాత్రి సెన్సేషనల్ అండ్ సెన్సువస్ స్టార్ అయిపోయింది త్రిప్తి దిమ్రి (Tripti Dimri).!

‘అర్జున్ రెడ్డి’ ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమాలో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ సరసన రష్మిక మండన్న హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

Also Read: Nayanthara: క్షమాపణ చెప్పిన ‘అన్నపూరణి’.!

అదే ‘యానిమల్’ సినిమాలో త్రిప్తి దిమ్రి ఓ చిన్న పాత్రలో కనిపించింది. చేసింది చిన్న రోల్ అయినా, ఆ రోల్ తాలూకు ఇంపాక్ట్ గట్టిగానే పడింది యంగ్ హార్ట్స్‌లో.

Tripti Dimri
Tripti Dimri

అదీ అసలు సంగతి.! గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కుతున్న సినిమా కోసమే త్రిప్తి దిమ్రిని హీరోయిన్‌గా ఎంపిక చేశారట.

అన్నట్టు, ‘లైగర్’ (LIGER) తర్వాత ‘ఖుషీ’ సినిమా చేసిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ‘ఖుషి’తో ఫర్వాలేదన్పించినా, ‘ఖుషీ’ (Kushi) మాత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది.

Digiqole Ad

Related post