Table of Contents
Viswaksen Arjun Sarja ఆయన పేరు అర్జున్.! ఆయన్ని అంతా యాక్షన్ కింగ్ అర్జున్ అంటారు.! పదుల సంఖ్యలో సినిమాలు చేస్తేనేం.?
దేశవ్యాప్తంగా మంచి నటుడిగా గుర్తింపు పొందితేనేం.? స్టంట్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్.. ఇలా ఎన్ని ప్రత్యేకతలుంటే మాత్రం.? మాస్ కా దాస్ విశ్వక్సేన్ ముందర ఆఫ్ట్రాల్ అర్జున్ అంతే.!
యాక్షన్ కింగ్ అర్జున్ అసలు విశ్వక్సేన్ లాంటి గొప్ప నటుడితో సినిమా చేయడానికి సాహసించడమేంటి నాన్సెన్స్ కాకపోతే.?
విశ్వక్ సేన్ సర్వాంతర్యామి..
విశ్వక్సేన్ ఎవరు.? కేవలం నటుడు మాత్రమే కాదు, దర్శకుడు.. అలాగే నిర్మాత కూడా.! విశ్వక్ సేన్.. తాను నటించే సినిమాకి అన్నీ తానే అయి వ్యవహరిస్తాడు.!
ఇతర దర్శకులతో విశ్వక్సేన్ సినిమాలు చేసినా, జస్ట్ పేరు మాత్రమే ఆ దర్శకులది. మొత్తం తనే చూసుకుంటాడు. నిర్మాత ఎవరైనా, విశ్వక్సేన్ మాటే చెల్లాలి.!
ఔను, అర్జున్ చాలా చాలా పెద్ద తప్పు పెట్టాడు. తన సీనియారిటీకి ఆయనే గౌరవం ఇచ్చుకోలేకపోయాడు. విశ్వక్సేన్తో సినిమా తీయడానికి ఎగేసుకుంటూ చెన్నయ్ నుంచి హైద్రాబాద్ వచ్చేశాడు.
Viswaksen Arjun Sarja యాక్షన్ కింగ్ అర్జున్ చేసిన నేరమదే..
ఏం, తమిళనాడులో యంగ్ హీరోలు లేరా.? తెలుగులో విశ్వక్సేన్ తప్ప మరో హీరో కనిపించలేదా యాక్షన్ కింగ్ అర్జున్‌కి.?
కింగు కాదు, బొంగు.. అనేశాడు అర్జున్‌ని విశ్వక్ సేన్ పరోక్షంగా.! లేకపోతే, షూటింగ్ ప్రారంభం కావాల్సిన రోజు తెల్లవారు ఝామున నాలుగ్గంటలకి అర్జున్‌కి విశ్వక్సేన్ మెసేజ్ పెట్టడమేంటి.?
‘నేను సినిమా గురించి గొప్పగా ఆలోచిస్తా.. అంత తెలివి అర్జున్‌కి లేదు. నన్నేదో కన్విన్స్ చేసెయ్యడానికి చూశాడు. నేను క్రియేటర్‌ని. ఎవడికిందా పని చేయలేను..’ అన్నట్టుగా విశ్వక్ సేన్ తన అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేశాడు.
‘రెండు గంటల ముందు మెసేజ్ పెట్టడం తప్పు. ఓ రెండ్రోజుల ముందైనా చెప్పి వుండాలి. ఈ విషయంలో సారీ చెబుతున్నా..’ అన్నాడు విశ్వక్సేన్. అంత సంస్కారవంతుడు మన మాస్ కా దాస్.!
కింగు కాదు.. బొంగు.!
ఇలాంటి సంస్కారం, తన సుదీర్ఘమైన కెరీర్లో ఏనాడూ యాక్షన్ కింగ్ అర్జున్ చూడలేదు. అదే అతని సమస్య.
సినిమా ఇండస్ట్రీలో అనుభవం సంపాదించడం ఓ శాపం ఈ రోజుల్లో. ఓ వయసుకొచ్చాక, సినిమాల మీద మమకారాన్ని చంపేసుకోవాలి.
Also Read: వ్యూహం.! శపథం.! ఆర్జీవీ మార్కు సినీ భ్రష్టత్వం.!
అంతేగానీ, ఇంకా ఏదో ఉద్ధరించేద్దామనుకుంటే, ఇదిగో ఇలాగే యంగ్ జనరేషన్ నుంచి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.!
సినిమా ఇంకా బతికే వుందని యాక్షన్ కింగ్ అర్జున్ లాంటోళ్ళు పిచ్చి భ్రమల్లో వున్నారు. అదే ఇలాంటి అనర్ధాలకి కారణం.