Anikha Surendran Butta Bomma తమిళనాట అజిత్, నయనతార జంటగా వచ్చిన ‘విశ్వాసం’ సినిమా గుర్తుంది కదా.? ఆ సినిమాలో అజిత్ – నయనతార జంటకు కుమార్తెగా నటించిన అనికా సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది.!
తెలుగులో అనికా సురేంద్రన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమానే ‘బుట్టబొమ్మ’. విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాని ఓ మలయాళ సూపర్ హిట్ సినిమాకి రీమేక్‌గా తెరకెక్కించారు.
నటీనటులంతా కొత్తవారే కనిపిస్తున్నారు. దర్శకుడు కూడా కొత్తవాడే. వెరసి, ఇదో కొత్త ప్రయోగంలా కనిపిస్తోంది తెలుగు తెరపై.
Anikha Surendran Butta Bomma.. బుట్టబొమ్మేగానీ..
సరదాగా ప్రారంభమై, సీరియస్ టోన్‌లోకి వెళ్ళిపోతోంది.. టీజర్‌ని అలా డిజైన్ చేశారు.! చాలా చాలా ప్లెజెంట్‌గా టీజర్ స్టార్ట్ అయ్యిందంటే అందుక్కారణం, అనికా సురేంద్రన్ ఫ్రెష్ అప్పీల్.
సూర్య, అర్జున్ దాస్ ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. అర్జున్ దాస్ ఒకింత వైల్డ్‌గా కనిపిస్తున్నాడు. సూర్య మళ్ళీ ప్లెజెంట్ లుక్‌తో వున్నాడు.
Also Read: నయా సంచలనం.! ఎవరీ Niharika NM?
సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థతోపాటు, ఫార్ట్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి లక్ష్మీ సౌజన్య ఈ సినిమాకి సహ నిర్మాత. నాగవంశీ నిర్మాత.
గణేష్ రావూరి ఈ చిత్రానికి మాటలు అందించాడు. సినిమా విడుదలకు సిద్ధమైంది.