బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, బాలీవుడ్ నటి మలైకా అరోరా (Malaika Arora) మధ్య వున్న సంబంధానికి ఏం పేరు పెట్టాలి.?
ఎవరిష్టం వాళ్ళది.! మోడ్రన్ సమాజం గనుక, డేటింగ్ అనాలేమో.! కాదు కాదు, ‘లివ్ ఇన్ రిలేషన్‌షిప్’ అంటే తప్పేముంది.? అబ్బే, ఇవేం కాదు జస్ట్ స్నేహం మాత్రమేనని అనే పరిస్థితి లేదు.
అర్జున్ కపూర్, మలైకా అరోరా గత కొంతకాలంగా ‘డేటింగు’లో వున్నారు. ఇద్దరి మధ్యా వున్న సంబంధానికి పేరు ఏదైనా పెట్టుకోవచ్చుగాక, బీభత్సంగా ప్రేమించేసుకుంటున్నారన్నది నిర్వివాదాంశం.
ప్రేమిస్తే తప్పేంటట.?
ఔను కదా.! అర్జున్ కపూర్ – మలైకా అరోరా మధ్య ‘ప్రేమ’ వుంటే దాన్ని తప్పు పట్టాల్సిన పనే లేదు. ప్రేమకు వయసుతో సంబంధం లేదు.!
మలైకా వయసులో చాలా పెద్దది అర్జున్ కపూర్ కంటే.! అయినా, ఆ ఇద్దరికీ లేని ఇబ్బంది చూసేవాళ్ళకెందుకు.?
నిజానికి, మలైకా అరోరాకి గతంలోనే పెళ్ళయిపోయింది.. ఆ వైవాహిక బంధం కొన్నాళ్ళ క్రితం పెటాకులైపోయింది. ఆమెకి ఎదిగిన కొడుకున్నాడు. అయినాగానీ, ఆమె సింగిల్.!
Malaika Arora అర్జున్.. మలైకా.. ఓ బిడ్డ.!
మలైకా అరోరా, అర్జున్ కపూర్.. త్వరలోనే తల్లిదండ్రులవుతారట. ఇదీ ఓ గాసిప్.! అయినా, ఇదేమన్నా జాతీయ సమస్యా.? దీని గురించి చర్చించుకోవడానికి.!

సెలబ్రిటీలు కదా.. జనాల్లో ఇంట్రెస్ట్ వుంటుంది సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి. అలా ఓ గాసిప్ పుట్టింది.. ఆ గాసిప్ విషయంలో గుస్సా అయ్యాడు అర్జున్ కపూర్.
చాన్నాళ్ళ క్రితం మలైకా – అర్జున్ కపూర్ మధ్య ఎఫైర్ అంటూ గాసిప్స్ వచ్చాయి.. అవి నిజమయ్యాయి. సో, వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారన్న గాసిప్‌ని తప్పు పట్టాల్సిన పనేముంది.?
Also Read: Rashmi Gautam.. తెలుగు తంటా.! ఎందుకోస‘మంట’.!
ఇంతకీ మలైకా – అర్జున్ కపూర్ ఎప్పుడు పెళ్ళి చేసుకోబోతున్నారు.? ప్చ్, దీనిపై బోల్డన్ని గాసిప్స్ చాలాకాలంగా వస్తూనే వున్నాయ్. వస్తూనే వుంటాయ్.
పెళ్ళి గురించి ఇద్దరికీ ప్రస్తుతానికైతే ఎలాంటి ఆలోచనా లేదట. సమీప భవిష్యత్తులో జరిగే జరగొచ్చునట. ఏమో, గుర్రం ఎగరావచ్చు.
లేటు వయసులో మలైకా ఇంకోసారి తల్లి అయ్యేందుకూ ఆస్కారం వుండొచ్చు. సరోగసీ అనేదొకటి వుంది కదా.? ఆ దిశగా ఏమైనా ప్లానింగ్ జరిగితే.. దాన్నెలా తప్పు పట్టగలం.?