Kiara Advani First Bikini Shot.. ఏంటీ, కియారా అద్వానీ ఇప్పటిదాకా బికినీతో వెండితెరపై కనిపించలేదా.? లేదేమో.! అందుకే, మొదటి బికినీ షాట్.. అంటోంది.!
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీయార్ కలిసి నటించిన ‘వార్-2’ సినిమాలో కియారా అద్వానీ కూడా ఓ కీలక పాత్రలో నటించింది.
తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో తెరంగేట్రం చేసిన కియారా అద్వానీ, ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ ఛేంజర్’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.
పలు బాలీవుడ్ సినిమాల్లోనూ కియారా అద్వానీ నటించింది.. కొన్ని హిట్లు.. కొన్ని డిజాస్టర్లు.. వెరసి, కియారా అద్వానీ సినిమా కెరీర్.. బాగానే వుందిప్పుడు.

వెండితెరపై అందాల ప్రదర్శనలో అస్సలేమాత్రం మొహమాట పడలేదు కియారా అద్వానీ ఇప్పటిదాకా. పెళ్ళయ్యాక కూడా, కియారా అద్వానీ, గ్లామర్ విషయంలో అస్సలు తగ్గలేదు.
ఇక, ‘వార్-2’ టీజర్‌లో కియారా అద్వాని టూ పీస్ బికినీ గ్లామర్.. టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమా ఇండస్ట్రీగా మారిపోయిందనడం అతిశయోక్తి కాదు.
Kiara Advani First Bikini Shot.. ఇదే మొదటి సారి అంట..
హృతిక్ రోషన్ కంటే, జూనియర్ ఎన్టీయార్ కంటే.. కియారా అద్వానీ పేరే ఎక్కువగా ట్రెండింగ్ అవుతోంది ప్రస్తుతం. అదీ, కియారా అద్వానీ బికినీ షాట్‌కి వున్న క్రేజ్.
యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై కియారా అద్వానీకి ఇదే తొలి సినిమా. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీయార్.. ఈ ఇద్దరితోనూ ఆమెకి ఇదే తొలి సినిమా.
Also Read: పెళ్ళి గోల.. మళ్ళీ మళ్ళీ.! సమంతకే ఎందుకిలా.?
దర్శకుడు అయాన్ ముఖర్జీతోనూ కియారా అద్వానికీ ఇదే తొలి సినిమా. అన్నిటికీ మించి, బికినీ షాట్‌లో తొలి సినిమా ‘వార్-2’ అట కియారా అద్వానీకి.
చాలా చిలిపిగా, ఈ వివరాలన్నిటినీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది కియారా అద్వానీ. అదీ అసలు సంగతి.
తెలుగులో కియారా అద్వానీ నటించిన మూడు సినిమాల్లో ఒకటి హిట్టు.. రెండు డిజాస్టర్లు.!