Rashmika Mandanna.. దక్షిణాది సినిమాల్లో మాస్ మసాలా సాంగ్స్ వుంటాయా.? ఐటమ్ నంబర్స్ అంటే సౌత్ సినిమా మాత్రమేనా.? బాలీవుడ్ సినిమాల్లో అయితే చక్కగా రొమాంటిక్ సాంగ్స్ వుంటాయా.?
అసలేమయ్యింది ‘నేషనల్ క్రష్’ రష్మిక మండన్నకి.? బాలీవుడ్ సినిమా ప్రమోషన్ల కోసం సౌత్ సినిమాని తగ్గించి చూపించాలా.?
తాజాగా ఓ బాలీవుడ్ సినిమా ఫంక్షన్‌లో రష్మిక, సౌత్ సినిమాకి సంబంధించి పాటల విషయమై చవకబారు వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ సినిమాల్లో పాటల గురించి ఆకాశానికెత్తేసింది.
బాలీవుడ్‌ని పొగడటం తప్పు కాదుగానీ..
బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ గురించి పొగడటం తప్పు లేదు. కానీ, ఇక్కడ సౌత్ ప్రస్తావన తీసుకొచ్చి.. సౌత్ సినిమా పాటల్ని ఎందుకు తక్కువ చేయాలి.?

స్టార్‌డమ్ రష్మికకి వచ్చిందంటే దానిక్కారణం సౌత్ సినిమా. దక్షిణాది సినిమాల్లో వచ్చిన పేరు ప్రఖ్యాతులే ఆమెకు హిందీ సినిమాల్లో అవకాశాలు వచ్చేలా చేశాయ్.
ప్చ్.. ఏరు దాటాక తెప్ప తగలేసిన చందాన, బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు రాగానే, సౌత్ సినిమా మీద సెటైర్లేస్తోందన్నమాట రష్మిక మండన్న.
అబ్బే, నా ఉద్దేశ్యం అది కాదు.. అని రష్మిక బుకాయించినా బుకాయించొచ్చు.. మహా మాటకారి ఆమె.!
Rashmika Mandanna కన్నడ సినీ పరిశ్రమపైనా అంతే..
తనకు సినీ నటిగా జన్మనిచ్చిన కన్నడ సినీ పరిశ్రమను లైట్ తీసుకుంది రష్మిక. అంతే కాదు, తన తొలి సినిమాని నిర్మించిన నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికీ రష్మిక ఆ మధ్య ఇష్టపడలేదు.
Also Read: పొట్టి డ్రస్సు.. అనసూయ కస్సు బుస్సు
ఓ తాప్సీ.. ఓ రష్మిక.. అంతే, అంతకు మించి అనుకోవడానికేమీ లేదు. పేరు ప్రఖ్యాతులు బాలీవుడ్‌లో రాగానే, తమ ఎదుగుదలకు కారణమైన దక్షిణాది సినిమాపై అవాకులు చెవాకులు పేలడం వీళ్ళకి అలవాటే.!
తమిళంలో రష్మిక నటించిన ‘వారిసు’ సినిమా తెలుగులోకి ‘వారసుడు’ పేరుతో డబ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లకు వచ్చినప్పుడు సౌత్‌లో రష్మికకి సెగ తగలకుండా వుంటుందా.?