Happy New Year.. డిసెంబర్ 31వ తేదీ, జనవరి 1వ తేదీ.! రెండిటికీ తేడా ఏముంది.? ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 31వ తేదీన సెలబ్రేషన్స్ చేసేసుకోవాలనుకుంటాం.
ఏడాదంతా కష్టపడ్డాం. సెలబ్రేషన్స్ చేసేసుకోవాల్సిందే.! ఔను కదా, సెలబ్రేషన్స్ చేసుకుంటే తప్పేంటి.? తప్పేమీ లేదు.. లేకపోతే, వున్నదంతా తగలేస్తేనే అసలు సమస్య. అమ్మో ఒకటో తారీఖు అక్కడ ఎదురు చూస్తుంది.
పీకల్దాకా తాగేసి రోడ్ల మీద అల్లరి చేస్తే, ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసులో బుక్కయిపోయే ప్రమాదముంది.
ప్రభుత్వాలకేంటి.? గల్లా పెట్టె నిండిపోతుంది.. న్యూ ఇయర్ వేడుకల కోసం పీకల్దాకా తాగేసేవాళ్ళతో.! అంతేనా, తప్పతాగి రోడ్ల మీద తిరిగితే.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. చలాన్లకు సొమ్ములు చెల్లించుకోవాలి.!
అవసరమా ఇదంతా.?
సెలబ్రేషన్స్ తప్పు కాదు.! కానీ, ఇదొక్కరోజే కాదు.. చేసుకుంటే ప్రతిరోజూ సెలబ్రేషనే. మదర్స్ డే, పాదర్స్ డే.. ఫ్రెండ్సిప్ డే, లవర్స్ డే.. ఆ పండగ, ఈ పండగ.. చెప్పుకుంటూ పోతే చాలా వుంటాయ్.!

కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.! కానీ, ఈ ప్రయత్నంలో సమస్యల్ని కొనితెచ్చుకోకూడదు.
పాత సంవత్సరంలోని మధురానుభూతుల్ని గుర్తు చేసుకుందాం.. కొత్త సంవత్సరానికి ఇంకా అందంగా స్వాగతం పలికేద్దాం.!
Happy New Year మారే డేటు.. మారాలి ఫేటు.!
డేటు మారుతుంది.. ఫేటు కూడా మారాలంటే.. వున్న చెడు అలవాట్లని మానుకోవాలి. కొత్తగా చెడు అలవాట్లను చేసుకోబోమని తీర్మానించుకోవాలి.
Also Read: పవన్ కళ్యాణ్, బాలకృష్ణ అన్స్టాపబుల్.! ఈ మొరుగుడేల.?
పాత సంవత్సరంలో ప్రదర్శించిన అలసత్వాన్ని గుర్తు చేసుకుని, కొత్త సంవత్సరంలో జాగ్రత్త పడాలి.! న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటే, 31వ తారీఖున అనుకుని, 1వ తారీఖు సాయంత్రానే మొదలెట్టడం కాదు.!
క్లాస్ ఎక్కువైంది కదా.! తప్పదు, పాటిస్తే ఆల్ హ్యాపీస్.! పాటించకపోతే, ప్రతి ఏడాదీ డిసెంబర్ 31న ఏడుస్తూ పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతాం.
చివరగా.. ప్రతిరోజూ కొత్త రోజే.! అందుకే, రాత్రి.. పగలు.! చీకటి తెరల్ని చీల్చుకుంటూ సూర్యుడు వచ్చేది.. మనలోని చీకట్లను మనమే తొలగించుకుని.. సరికొత్తగా మనల్ని మనం ఆవిష్కరించుకోవాలని చెప్పేందుకే.!
– yeSBee