Cancer Vaccine.. క్యాన్సర్.! ఇదొక మహమ్మారి. మారుతున్న జీవన శైలి కారణంగా క్యాన్సర్ విచ్చలవిడిగా విజృంభించేస్తోంది.. మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
కేవలం ప్రాణాలు తీసెయ్యడమే కాదు, ఆర్థికంగా కుటుంబాలు చితికిపోయేలా చేస్తోంది క్యాన్సర్. ఎందుకంటే, క్యాన్సర్ చికిత్స చాలా ఖరీదైనది.
క్యాన్సర్ చాలా వ్యాధుల్లా ప్రాణాంతకమైనదే అయినా, అంతకు మించి.. ఖర్చుతో కూడుకున్నది. అందుకే, క్యాన్సర్ అనేది వ్యక్తుల మీద, కుటుంబాల మీదా మాత్రమే కాదు, సమాజం మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.
Cancer Vaccine.. వ్యాక్సిన్ వచ్చేస్తోందహో..
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ నిమిత్తం వ్యాక్సిన్ అందుబాటులో వుంది. అయితే, దీని పట్ల అవగాహన చాలా చాలా పెరగాల్సి వుంది.
వైద్యులు ఈ వ్యాక్సిన్లను సూచిస్తున్నా, వ్యాక్సిన్లు వేయించే విషయంలో ప్రజల్లో చాలా అపోహలున్నాయి.
ఏటా ఎక్కువ శాతం మహిళలు ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీటి కారణంగా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతూ వస్తోంది.
వ్యాక్సిన్ల పట్ల అవగాహన పెరిగితే, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ని పూర్తిగా నివారించేందుకు వీలుంటుందన్నది నిపుణుల అభిప్రాయం.

మరోపక్క, అన్ని రకాల క్యాన్సర్లను నివారించే వ్యాక్సిన్ కనుగొనడం దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. ఈ పరిశోధనల్లో భాగంగా కీలకమైన ముందడుగు పడింది.
రోగ నిరోధక చికిత్సను ఎంఆర్ఎన్ఏ టీకాతో కలిపి ఇవ్వడం ద్వారా చర్మ క్యాన్సర్ తిరగెబ్టే ముప్పు గణనీయంగా తగ్గుతోందని గుర్తించారు. మరణించే అవకాశం కూడా 44 శాతం వరకు తగ్గుతోందిట.
ప్రయోగాలు మరిన్ని జరగాలి..
ఈ దిశగా ప్రయోగాలు మరిన్ని జరగాల్సి వుంది. వివిధ రకాల క్యాన్సర్ల చికిత్సలో రకరకాల మందుల్ని కలిపి వినియోగించడం కొత్తేమీ కాదు.
ఆ ప్రయోగాలు సఫలమైతే, త్వరలోనే క్యాన్సర్‌కి సమర్థవంతమైన వైద్య చికిత్స, వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం వుంటుంది.
Also Read: Pawan Kalyan KUSHI.. ఓ జనరేషన్‌కి ఇన్స్పిరేషన్.!
క్యాన్సర్ వచ్చాక చికిత్స సంగతెలా వున్నా వ్యాక్సిన్ల ద్వారా నివారించగలిగితే.. రోగులపై, రోగుల కుటుంబాలపై, ప్రభుత్వాలపై కూడా ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది.
ఆరోజు తొందరలోనే రావాలని ఆకాంక్షిద్దాం.