Table of Contents
Telugu NRIs In America విన్నారా.? ఇది మీకు తెలుసా.? అమెరికాలో మనోళ్ళు సిగ్గు లేకుండా కొట్టుకున్నారట.! అందులో ఒకడ్ని డల్లాస్ పోలీసులు అరెస్టు చేశారట.!
కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిందీ గొప్ప కార్యం.! ఔను, మనోడే.. ఘనకార్యమే చేశాడు మరి.!
డల్లాస్ పోలీసులు వాడ్ని అరెస్టు చేశారంటే.. ఎంత గొప్పోడై వుండాలి. ఛత్.! కాస్తంతైనా సిగ్గు లేదాయె.! ఔను, నిజంగానే సిగ్గు లేదు. లేకపోతే, హీరోల పేరు చెప్పి.. కులం పేరు చెప్పి దిగజారిపోవడమేంటి.?
నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?
అమెరికాలో మనోళ్ళు విద్య, ఉద్యోగాల్లో అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారు. ప్రముఖ వైద్యులుగా, పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలుగా.. అహో.. మనోళ్ళు సాధిస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు.
అన్ని చోట్లా వెధవలు వున్నట్లే.. అమెరికాలోనూ మన వెధవలు కొందరు తగలడ్డారు. కులం పేరుతో కొట్టుకుంటారు.. సినీ హీరోల అభిమానులమంటూ దిగజారిపోతారు.
ఆయా కులాల పేర్లతో అమెరికాలో మనోళ్ళు కొందరు సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. దిగజారుడుతనం అసలు మొదలైంది ఇక్కడే.!
అక్కడిదాకా వెళ్ళి పరువు పోగొట్టుకోవడమెందుకు.?
కొట్టుకు ఛావాలంటే అమెరికా వరకూ వెళ్ళడమెందుకు.? తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక గల్లీలో కొట్టుకోవచ్చు కదా.!
తెలుగు రాష్ట్రాల్లో.. అందునా, ఆంధ్రప్రదేశ్‌లో కులం పేరుతో జరుగుతున్న గొడవల గురించి కొత్తగా చెప్పేదేముంది.? సినీ అభిమానుల ముసుగులో జరిగే రచ్చ గురించి ఏమని చెప్పగలం.?
అమెరికాలో కూర్చుని, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్ని విశ్లేషించేస్తారు కొందరు. తప్పు లేదు.! కానీ, ఇక్కడ కూడా వాడకూడని జుగుప్సాకరమైన, అభ్యంతరకరమైన బూతుల్ని విదేశాల నుంచి వాడేస్తున్నారు.
Telugu NRIs In America.. ఏం బతుకులు రా బాబూ.!
మీ అమ్మా నాన్నా.. మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని అమెరికా వరకూ పంపించారు.? వారి పేరు చెడగొట్టడం తప్ప, ఇలాంటి వ్యవహారాలతో మీరు సాధించేదేంటి.?
Also Read: డేటు మారుద్దంతే.! ఫేటు మారాలంటే మాత్రం.!
చేతనైతే, దేశానికి పేరు తీసుకు రండి. మీరు పుట్టిన తెలుగు నేలకు మంచి పేరు తీసుకురండి. మీ ఊరుకి మంచి పేరు తీసుకురండి.
ఇవేవీ చేతకాకపోతే, కనీసం మీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురాకుండా అయినా చూసుకోండి.!
చివరగా.! కడివెడు పాలని చెడగొట్టడానికి రెండు చుక్కల నిమ్మరసం చాలన్నట్టు.. ఎన్నారైలు అంటే.. బోల్డంత గౌరవం.. అందులో, కొన్ని విషపు చుక్కలు చేరి.. ఎన్నారైల పరువు తీస్తున్నారు.
– yeSBee