Naatu Naatu Song.. వాట్ ఏ మూమెంట్.! భారతీయ సినిమా గర్వించదగ్గ సందర్భమిది. అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా.. తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి అత్యంత ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాల్లో ఒకటైన ‘గోల్డెన్ గ్లోబ్’ వరించింది. బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ స్కోర్ విభాగంలో ఈ పాటకి పురస్కారం దక్కింది.
అవార్డుని అందుకున్న సంగీత దర్శకుడు కీరవాణి, ఈ పురస్కారం తన సోదరుడు రాజమౌళికి దక్కాలంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.
Naatu Naatu Song.. జక్కన్న మామూలోడు కాదు..
‘నాటు నాటు’ పాట చిత్రీకరణ సమయంలో రాజమౌళి తమను చాలా ఇబ్బంది పెట్టేశాడనీ, అలా రాజమౌళి ఇబ్బంది పెట్టడం వల్లనే పాట అంత బాగా వచ్చిందని ఎన్టీయార్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.
రాహుల్ సిప్లిగంజ్ వాయిస్, చంద్రబోస్ లిరిక్స్.. వీటన్నిటికీ మించి రామ్ చరణ్, ఎన్టీయార్ పోటా పోటీగా వేసిన డాన్సులు.. దీనికి కీరవాణి మ్యూజిక్.. వెరసి, ‘నాటు నాటు’ పాట ఇంత పెద్ద హిట్టయ్యింది.
Also Read: ఎక్స్క్లూజివ్.! శర్వానంద్ పెళ్ళికి ‘డాష్’ హడావిడి.!
రాజమౌళి టేకింగ్, సినిమాటోగ్రాఫర్ పనితీరు, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ.. వాట్ నాట్.. ఏదీ తక్కువ కాదు.!
దేశమే కాదు, ప్రపంచమంతా ‘నాటు’ స్టెప్పులేస్తోంది..
మెగాస్టార్ చిరంజీవి, ఈ అరుదైన సందర్భం గురించి ట్వీట్ చేస్తూ, ‘దేశమే కాదు.. ప్రపంచమంతా మీతో కలిసి డాన్స్ చేస్తోంది..’ అంటూ పేర్కొన్నారు.