RRR Movie Naatu Naatu.. అమ్మకానికి అవార్డులు.! ఇది కొత్త విషయమేమీ కాదు. కొనుక్కుంటే డాక్టరేటు పురస్కారాలు చాలా తేలిగ్గా వచ్చేస్తాయ్.! మార్కెట్‌లో అంగడి సరుకుల్లా తయారయ్యాయవి.
తెలుగునాట ‘నంది’ పురస్కారాలు ఒకప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకం. వాటికి కూడా ‘అమ్మకానికి అవార్డులు’ అనే అపప్రధ వచ్చింది. అవి కొంతకాలంగా ప్రకటితమవడంలేదు.
ఇక, ఫిలింఫేర్, పైమా వంటి పురస్కారాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జాతీయ అవార్డులపైన కూడా ‘అమ్మకానికి అవార్డులు’ అన్న విమర్శ ఎప్పటినుంచో వుంది.
RRR Movie Naatu Naatu.. గోల్డెన్ గ్లోబ్ కథేంటి.?
‘నాటు నాటు’ పాటకిగాను ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కించుకుంది. అంతే, మళ్ళీ ‘అమ్మకానికి అవార్డులు’ అంశం తెరపైకొచ్చింది.
అదేమీ ప్రతిష్టాత్మకమైన పురస్కారం కాదనీ, కొనుక్కుంటే దొరుకుతుందనీ కొందరు విశ్లేషిస్తున్నారు. ఏమో, అలా జరుగుతుందేమో కూడా.! ‘కాదు’ అనలేం.!

అయితే, ఇంకెవరూ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని కొనుక్కోలేకపోయారా.? ఆ స్తోమతు కేవలం ‘ఆర్ఆర్ఆర్’ బృందానికి మాత్రమే వుందా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.
రేప్పొద్దున్న ఆస్కార్ అయినా అంతే..
ఒకవేళ ఆస్కార్ పురస్కారం గనుక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి దక్కితే.. దాన్ని కూడా కొనేశారని అంటారేమో.! ‘ఆర్ఆర్ఆర్’ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది.
Also Read: Blue Stray Dog.. ‘ఫీట్లు’ నాక్కోక, నీకెందుకు ట్వీట్లు.!
మన తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ప్రపంచ వేదికల మీద సత్తా చాటుతోంది. అవార్డులు కొత్త ఉత్సాహాన్నిస్తాయ్.! వాటి మీద బురద చల్లే ప్రయత్నం సమర్థనీయం కాదు.!
సినిమా అంటే వ్యాపారం.! అయినాగానీ, అన్నిటినీ కొనేస్తారంటే.. అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?
– yeSBee