Keerthy Suresh Mangalasutra.. కాదేదీ ట్రెండింగ్‌కి అనర్హం.. అనుకోవాలిప్పుడు.! కుక్క పిల్ల.. సబ్బు బిళ్ళ.. అగ్గి పుల్ల.. ఏదైనా సిత్రమే ఈ రోజుల్లో.!
అలా ప్రస్తుతం కీర్తి సురేష్ ‘తాళి’ సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్ అయి కూర్చుంది. ఇటీవలే కీర్తి సురేష్ పెళ్ళి పీటలెక్కింది.
ఇలా పెళ్ళి చేసుకుందో లేదో.. అలా ఆమె తన తాజా చిత్రం సినిమా ప్రమోషన్లలో బిజీ అయిపోవాల్సి వచ్చింది. అది కూడా హిందీ సినిమా.
సినిమా ప్రమోషన్లలో కీర్తి సురేష్ ఎంత యాక్టివ్‌గా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాన్ని ఆమె ఓ గొప్ప బాధ్యతగా భావిస్తుంటుంది.
Keerthy Suresh Mangalasutra.. ప్రమోషన్స్‌లో కీర్తి సురేష్ రూటే సెపరేటు..
కొంతమంది హీరోయిన్లుంటారు.. సినిమా ప్రమోషన్లని అస్సలు పట్టించుకోరు. కీర్తి సురేష్ రూటే సెపరేటు. సినిమాలో నటించడం, ఆ సినిమాని బాగా ప్రమోట్ చేయడం.. ఇదంతా ఓ ప్యాకేజీ అనుకుంటుంది కీర్తి సురేష్.
బాలీవుడ్ సినిమా ప్రమోషన్ల సందర్భంగా కీర్తి సురేష్ మెడలో తాళితో కనిపిస్తోంది. కొత్త పెళ్ళి కూతురు కదా.. పసుపుతాడు ఆమె మెడలో కనిపిస్తోంది.
Also Read: శ్రీలీల ఇక ఇంతేనా.?
ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ అనీ.. పెళ్ళయిన హీరోయిన్లు, అసలు మెడలో తాళి కూడా వుంచుకోవడంలేదనీ.. కీర్తి సురేష్ చేస్తున్నది జస్ట్ ఓవరాక్షన్ మాత్రమేనని కామెంట్ చేసేవాళ్ళూ వున్నారు.
అన్నట్టు, చీర కట్టుకుని రావొచ్చు కదా.. మోడ్రన్ డ్రస్సుల్లో యెద భాగం బాగా చూపించేస్తూ, పసుపుతాడుని ప్రమోట్ చేసుకోవడమేంటన్నది ఆ కొందరి గోల.
ఎవడి పైత్యం వాడిది..
ఎవరి ఏడుపు వాళ్ళది.. అనుకోవాలా.? అంతేనేమో.! ఇక, తన సినిమా ప్రమోషన్ల కోసం పెళ్ళయిన వెంటనే వచ్చిన, కీర్తి సురేష్‌ని అభినందించకుండా వుండలేం.
ట్రోలింగ్ అంటారా.? అదో పైత్యం. ఆ పైత్యానికి విరుగుడు లేదు.!
పెళ్ళయ్యాక కూడా కీర్తి సురేష్ వరుస సినిమాలతో బిజీ అవబోతోంది. తెలుగుతోపాటు తమిళ, హిందీ సినీ పరిశ్రమల్లోనూ ఇప్పుడు కీర్తి సురేష్‌కి బోల్డంత పాపులారిటీ కనిపిస్తోంది.