Pawan Kalyan Ali.. ‘పవన్ కళ్యాణ్ నాకు మంచి స్నేహితుడు..’ ఈ మాట పదే పదే సినీ నటుడు అలీ చెబుతుంటాడు. చెప్పాల్సిందే మరి.!
నిజమే, పవన్ కళ్యాణ్‌కి అలీ మంచి స్నేహితుడు. కానీ, ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు ఇద్దరూ సహ నటులు మాత్రమే. ఆ స్నేహం అలాగే ఇద్దరి మధ్యా వుందని ఎలా అనుకోగలం.?
అసలు రాజకీయ నాయకులకు సిగ్గనేది వుండదా.? రాజకీయంగానే అయినా.. ఓ సారి తిట్టాక, ఇంకోసారి ఎలా కలుసుకుంటారు.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?
Mudra369
స్నేహమంటే ఏంటి.? ఇద్దరి మధ్య స్నేహం వుంటే, ఒకర్ని ఇంకొకరు గెలిపించుకోవాలనుకుంటారు. అంతే గానీ, ఒకరి మీద ఒకరు పోటీకి ధిగి, ఒకర్ని ఇంకొకరు ఓడించాలనుకోరు.
Pawan Kalyan Ali.. స్నేహం వేరు.. రాజకీయం వేరు..
స్నేహం వేరు.. రాజకీయం వేరు.! వినడానికి చాలా ఛండాలంగా వుంటుంది ఈ మాట. సినిమా వేరు, రాజకీయం వేరు.. అని ఎవరైనా అన్నగానీ, అలాగే కంపరం పుడుతుంది.
కాస్సేపు రాజకీయం పక్కన పెట్టేస్తే.. అందరూ బంధువులే.! మీడియా ముందు తిట్టుకున్నప్పుడు బద్ధ శతృవులైపోతారు. రాజకీయాల్లో మరీ ఇంతలా నటించాలా.?

అసలు రాజకీయ నాయకులకు సిగ్గనేది వుండదా.? రాజకీయంగానే అయినా.. ఓ సారి తిట్టాక, ఇంకోసారి ఎలా కలుసుకుంటారు.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?
పవన్ కళ్యాణ్‌ని నానా తట్లూ తిడుతోంటే..
పొద్దున్న లేస్తే, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై నానా రకాల విమర్శలూ చేస్తున్నారు వైసీపీ నేతలు. ఆ పార్టీలో వుంటూ, పవన్ కళ్యాణ్ ‘నా స్నేహితుడే..’ అంటున్నారు అలీ.
Also Read: అదిగదిగో వారాహి.! అతి త్వరలో జనంలోకి పవన్ కళ్యాణ్.!
రాజకీయాల్లో కూడా అలీ కామెడీ చేస్తున్నాడనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఏ స్నేహితుడైనా, తన స్నేహితుడ్ని ఇంకెవరో తిడుతోంటే ఊరుకుంటాడా.?
ఇది రాజకీయ స్నేహం. ఇక్కడింతే. అసలు వీళ్ళను రాజకీయ నాయకులనాలా.? స్నేహితులని అనగలమా.? అసలు మనుషులని ఒప్పుకోగలమా.? అన్నదే సామాన్యుడి డౌటానుమానం.!