Pawan Kalyan Varahi.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనంతో జనంలోకి వెళ్ళబోతున్నారు.
ఈ నెల 24న తెలంగాణలోని కొండగట్టులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
గతంలో కొండగట్టు ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో హై టెన్షన్ విద్యుత్ తీగలు తగిలాయి.
‘మనల్ని ఎవడ్రా ఆపేది.?’ అంటూ అధికార వైసీపీకి తనదైన స్టయిల్లో జనసేన అధినేత ప్రతి సవాల్ విసిరారు.
Mudra369
అయితే అదృష్టవశాత్తూ స్వల్ప గాయంతో పవన్ కళ్యాణ్ ప్రాణాపాయం తప్పించుకున్నారు. అప్పటినుంచి కొండగట్ట ఆంజనేయస్వామి పట్ల మరింత భక్తిభావం పెంచుకున్నారు.
Pawan Kalyan Varahi.. వారాహితో మొదలు..
తన రాజకీయ కార్యకలాపాల్ని వీలైనంతవరకు కొండగట్టు నుంచి ప్రారంభించేందుకు పవన్ కళ్యాణ్ ఇష్టపడతారు.
కాగా, ఈ నెల 24 నుంచి పవన్ కళ్యాణ్ ‘అనుష్టుప్ నారసింహ యాత్ర’ను ప్రారంభిస్తారు. ఈ యాత్రలో మొత్తం 32 నారసింహ క్షేత్రాలను సందర్శిస్తారు.
కొండగట్టులో ప్రత్యేక పూజ, ఆ తర్వాత ధర్మపురి నుంచి అనుుష్టుప్ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ మేరకు జనసేన పార్టీ నుంచి ఓ ప్రకటన విడుదలైంది.
వారాహి స్పెషల్ డిజైన్..
‘వారాహి’ వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఆలివ్ గ్రీన్ రంగుతో మిలిటరీ వాహనాన్ని తలపించేలా దీన్ని రూపొందించడం జరిగింది.
మరోపక్క, వారాహి వాహనం రంగు విషయంలో నానా యాగీ చేసిన ఏపీలోని అధికార వైసీపీ అభాసుపాలయ్యింది.
‘ఎలా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోకి ఆ వాహనాన్ని తీసుకొస్తారో చూస్తాం’ అంటూ వైసీపీ నేతలు, కొందరు మంత్రులు ఇప్పటికే శపథం చేశారు.
Also Read: ‘వాల్తేరు వీరయ్య’.! అలవోకగా 100 కోట్ల క్లబ్బులోకి.!
కాగా, ‘మనల్ని ఎవడ్రా ఆపేది.?’ అంటూ అధికార వైసీపీకి తనదైన స్టయిల్లో జనసేన అధినేత ప్రతి సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాజకీయాలపైనా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు.
‘వారాహి’ వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు, అదే రోజు తెలంగాణ జనసేన నేతలకు రాజకీయంగా దిశా నిర్దేశం కూడా చేస్తారు.