Andhra Pradesh Political Jokers ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువైపు వెళుతున్నాయి.? కమెడియన్లు, బ్రోకర్ల చుట్టూ ఎందుకు రాజకీయ రచ్చ నడుస్తోంది.? అసలేంటి కథ.!
మొన్న జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది.. నిన్న సీనియర్ కమెడియన్ అలీ.. నేడు కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ.!
ప్రత్యేక హోదా ఎవరికీ అవసరం లేదు.! రాజధాని గురించిన సోయ ఎవరికీ లేదు.
పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్.. దుగరాజపట్నం పోర్టు.. కడప స్టీలు ప్లాంటు.. ఇవన్నీ సీరియస్ అంశాలు. సీరియస్‌గా రాజకీయాలు చేయడం మానేసి, సిల్లీగా కామెడీ చేస్తున్నారంతా.

ప్రధానంగా అధికార వైసీపీ చేస్తున్న కామెడీ అంతా ఇంతా కాదు. ఇదంతా డైవర్షన్ రాజకీయాల్లో భాగమేనని అనుకోవాలేమో.
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది, జనసేన పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకుంటూ ‘జనసేన యువశక్తి’ వేదికగా, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశాడు.
Andhra Pradesh Political Jokers.. కమెడియన్ని సీరియస్‌గా తీసుకున్నారేం.?
‘చిన్న ప్రాణాలు.. వాళ్ళెంత.?’ అని లైట్ తీసుకుంటూనే, హైపర్ ఆదికి బోల్డంత ‘వెయిట్’ ఇచ్చి మంత్రి రోజా, తీవ్ర వ్యాఖ్యలు చేయడం పెను దుమారం రేపింది ఏపీ రాజకీయాల్లో.

ఇంతలోనే, సీనియర్ నటుడు అలీ ‘పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధం’ అంటూ ప్రకటించడం అంతకు మించిన పెద్ద దుమారమైంది. అలీ ఏంటి.? పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయడమేంటి.?
‘మీడియా అడగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడంటే.. జగన్ పోటీ చేయమని ఆదేశిస్తే పోటీ చేస్తానన్నాడంతే..’ అంటూ అలీ విషయంలో ఓ సినీ ప్రముఖుడు త్రిపురనేని చిట్టి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు బ్రహ్మాజీ వంతు.!
మరో సీనియర్ నటుడు బ్రహ్మాజీ, రోజా వ్యాఖ్యల్ని తప్పు పట్టాడు. చిరంజీవి ఎవర్నీ ఎప్పుడూ భయపెట్టరనీ, ఆయన మీద గౌరవం మాత్రమే వుంటుందన్నాడు.
కమెడియన్లను చూసి రోజా ఎందుకు భయపడుతున్నారంటూ బ్రహ్మాజీ ప్రశ్నించిన వైనం తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

నూట డెబ్భయ్ ఐదుకి నూట డెబ్భయ్ ఐదు నియోజకవర్గాల్లోనూ గెలిచేస్తామనే ధీమా వున్నప్పుడు, కమెడియన్ల చుట్టూ ఎందుకు అధికార వైసీపీ ఇంతలా ఉలికిపాటు రాజకీయాలు చేస్తున్నట్టు.?
బాబూమోహన్ కమెడియనే.. కానీ, ఆయన రాజకీయాల్లోనూ రాణించాడు. రాజకీయ బ్రోకర్లతో పోల్చితే కమెడియన్లు చాలా చాలా గొప్ప.
Also Read: Blue Stray Dog.. ‘ఫీట్లు’ నాక్కోక, నీకెందుకు ట్వీట్లు.!
‘పొలిటికల్ జోకర్లు.. బ్రోకర్లు.. వెరసి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయ్..’ అని రాజకీయ విశ్లేషకులు ప్రస్తుత రాజకీయాల గురించి విశ్లేషించే పరిస్థితి వచ్చింది.
రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయ్.. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని.. ఇన్ని అంశాలు పెట్టుకుని, జోకర్లు.. బ్రోకర్లంటూ ఈ దిగజారుడు రాజకీయమేంటి.? ఇంతకీ జోకర్లెవరు.? బ్రోకర్లెవరు.?