Nara Lokesh Yuva Galam.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే.
రాజకీయాలన్నాక పాదయాత్రలు తప్పవన్నట్టుగా మారింది పరిస్థితి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు.. అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పాదయాత్రలు చేశారు.
పాదయాత్రలు చేస్తే అధికారం దక్కుతుందా.? అంటే, ‘ఔను’ అనడానికి వైఎస్సార్, చంద్రబాబు, జగన్ పాదయాత్రలే ఉదాహరణ.
Nara Lokesh Yuva Galam.. అధికారమే లక్ష్యంగా..
సో, నారా లోకేష్ కూడా ‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేస్తున్నది అధికార పీఠమెక్కేందుకే. పాదయాత్రలో ప్రజల కస్టాలు తెలుసుకున్నాం.. అని వైఎస్సార్, చంద్రబాబు, జగన్ చెప్పారు.!

మరి, ప్రజల కష్టాలు తీరాయా.? అంటే, ఇప్పటికీ ప్రజల కష్టాలు అలాగే వున్నాయ్. ముందు ముందు కూడా వుంటాయ్.!
వాస్తవానికి పాదయాత్రలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కోట్లల్లో ఖర్చవుతుంది. స్థానిక నాయకులే పెట్టబడులు పెట్టుకోవాలి. అప్పులు చేసి మరీ ఈ యాత్రల కోసం ఖర్చు చేస్తుంటారు.
పార్టీలకూ వాచిపోతుంది..
ఆయా పార్టీలూ ఇబ్బడి ముబ్బడిగా పాదయాత్రలకు ఖర్చు చేయాల్సిందే. కార్యకర్తలు, ప్రజల పేరుతో రోజువారీ కూలీ ఇచ్చి జనాన్ని తీసుకురావాలి మరి.!
ఎవరు చేసినా ఇదే పని.! నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర కూడా అంతే. గతంలో జగన్ చేసిన పనే, ఇప్పుడు నారా లోకేష్ చేస్తోంటే.. వైసీపీ జీర్ణించుకోలేకపోతోందన్నది టీడీపీ ఆరోపణ.
Also Read: తప్పదు చిరంజీవీ.! పేడ పురుగుల్ని దూరం పెట్టాల్సిందే.!
లోకేష్ పాదయాత్రని చూసి జగన్ భయపడుతున్నారని టీడీపీ ఆరోపించడంలో వింతేమీ లేదు. ఎందుకు భయపడాలి.? అవసరమైతే ముఖ్యమంత్రి హోదాలో జగన్ కూడా పాదయాత్ర చేసినా చేసేస్తారు.!
ఆంక్షలన్నవి కేవలం విపక్షాలకు మాత్రమే.! అధికారంలో వున్నోళ్ళకి చట్టాలు, నిబందనలు వర్తించవ్.! ఎవరు అధికారంలో వున్నా ఇదే వాస్తవం.!