Pavitra Naresh Malli Pelli.. ఇదేం పైత్యం.. చాలా చిరాగ్గా అనిపిస్తోంది. ఈ వయసులో ఈ ప్రేమ కథ పైత్యమేంటీ.? తనకంటూ ఓ స్టార్‌డమ్ వుంది కదా.. దాన్ని చెడగొట్టుకోవడానికేనా ఇదంతా.? అసలు ఆయనకి ఏమైంది.?
ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో ఈ పాటికే అర్ధమైపోయుంటుంది. వార్తల్లో ఈ మధ్య ఎక్కువ సెన్సేషనల్ అయిన న్యూస్ ఏమైనా వుందంటే, అది వారి ప్రేమకథే.
అదేనండీ, సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్ లొల్లి ప్రేమ. ముదురు వయసులో ఈ జంట చేసిన ప్రేమ హల్‌చల్ అంతా ఇంతా కాదు. జుగుప్ప కలిగించింది.
Pavitra Naresh Malli Pelli.. అడ్డంగా దొరికేసి.. చెప్పు దెబ్బలు తినేసి..
నరేష్ మూడో భార్యకు యోయో రూమ్‌లో అడ్డంగా దొరికేసి.. ఆ తప్పును కప్పి పుచ్చుకోవడానికి ఈ జంట చేసిన యాగీ గురించి ఎంత చెప్పినా తక్కువే.
అది చాలదన్నట్లు ఇంకా ఎవరికైనా ఈ లొల్లి గురించి తెలియదేమో.. వాళ్లకి డీటెయిల్డ్‌గా చెప్పినట్లుందని ఈ ముదురు జంట వీర ముదరు ప్రేమగాధని ఓ సినిమాగా తెరకెక్కించేశారు.
‘మళ్లీ పెళ్లి’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ సినిమా మన కర్మ కొద్దీ త్వరలో ధియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
నరేష్ గారు ఈ సినిమాని తన సొంత బ్యానర్‌లోనే రూపొందించారు. ఇదో సినిమా అనేకన్నా, ఆయనగారి బయోపిక్ అంటే అతిశయోక్తి అనిపించదేమో.
ఈ వయసులో ఇదేం పిచ్చి కోరిక చెప్మా.!
అంతలా తన లైఫ్‌లో జరిగిన సంఘటనలు ముఖ్యంగా మూడో భార్య, తాజా ప్రేమ.. ఆ ప్రేమ పేరుతో చేసిన పిచ్చి రొమాన్స్.. ఇలా చాలానే చూపించేశారని ట్రైలర్ ద్వారా అర్ధమవుతోంది.
అలాగే మా ఎలక్షన్స్ టాపిక్‌తో పాటూ, మూడో భార్యని ఏ రేంజ్‌లో టార్చర్ చేశాడో నరేష్.. అది కూడా నిర్మొహమాటంగా చూపించేసినట్లు తెలుస్తోంది.
Also Read: The Vijay Deverakonda: హరీష్ శంకర్ వర్సెస్ అనసూయ.!
అసలు నరేష్‌కి ఈ వయసులో ఎందుకీ పైత్యం.? కామెడీ హీరోగా ఒకప్పుడు స్టార్‌డమ్ వున్నోడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు ఇప్పుడు.
అలాంటిది, ఇలాంటి ఓ బోల్డ్ కంటెంట్ సినిమా తీయాలన్న పిచ్చి కోరిక ఎందుకు పుట్టిందో. పుడితే పుట్టింది.. ఆ పైత్యాన్ని సినిమాగా జనాల నెత్తిన రుద్దుడేందో.! మన ఖర్మ కాకపోతేనూ.! ఇదే ఇప్పుడు ఆడియన్స్, నెటిజన్స్ అభిప్రాయం.